పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

243


పంపేందుకు కేసు పెట్టటంలో ప్రభుత్వానికి లాభమేమీ కనిపించలేదు. దానికి బదులు తాము శాంతంగా వుంటే ఉద్యమించేందుకు మరో మార్గం లేక ఆందోళన కారులు సైతం శాంతిస్తారని ప్రభుత్వం అభిప్రాయపడింది కాని ప్రభుత్వం యొక్క యీ ఆలోచన తప్పని ఋజువైంది. ప్రభుత్వం యొక్క ధైర్యాన్ని పరీక్షించేందుకై ఆందోళనకారులు తీసుకున్న కొత్త ఎత్తుగడ వల్ల ప్రభుత్వం యొక్క ధైర్యం త్వరలోనే సడలింది



30

సేఠ్ దావూద్ ముహమ్మద్ మొదలైనవారి సంగ్రామ ప్రవేశం

ప్రభత్వుం ఏ కొత్త నిర్ణయమూ తీసుకోకుండా, తమను అలిసిపోయేలా చేయాలని ప్రయత్నించటం చూసిన భారతీయులు, తామే కొత్త పథకాన్ని వేయటం అనివార్యమని తెలుసుకున్నారు. సత్యాగ్రహునిలో దుఃఖాన్ని భరించే వున్నంత వరకూ అతనెప్పుడూ అలిసిపోడు. అందువల్ల ప్రభత్వ నిర్ణయాన్ని తప్పని ఋజువు చేయుట సమర్థత జాతికి వున్నది. నేటాల్‌లో వున్న చాలామంది భారతీయులకు ట్రాన్స్‌వాల్‌లో నివసించే అధికారం ఎప్పటినుంచో వుంది. వ్యాపారం కోసం ట్రాన్స్‌వాలులో ప్రవేశించవలసిన అవసరం వారికి లేదు. కానీ భారతీయులు వచ్చిందని భావిస్తున్నారు ఇంతేకాకుండా ఆంగ్ల భాషా పరిజ్ఞానమూ వుంది. సోరాబ్జీ ఉదాహరణలో తక్కిన భారతీయులను సైతం ట్రాన్స్‌వాల్లో ప్రవేశపెట్టటం వల్ల సత్యాగ్రహానికి భంగమేమీ వాటిల్లదు. అందువల్ల మేము రెండు విధాలైన భారతీయులను ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశింప జేయటానికి నిశ్చయించ కున్నాము ఇది వరకే ట్రాన్స్‌వాల్‌లో వుండి వెళ్ళిన భారతీయులు రెండవ రకం- ఆంగ్ల భాషలో సుశిక్షితులైనందువల్ల విద్యాధికులుగా పరిగణింపబడే భారతీయులు వీరిలో దావూద్ ముహమ్మద్, పారసీ రుస్తమ్ గారు పెద్ద వ్యాపారస్థులైతే, సురేంద్రరామ్