పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

సోరాబ్జీ ఫాపుర్జీ అడాజణియా


సోరాబ్జీతో ఎలా వ్యవహరించాలో ప్రభుత్వం నిర్ణయించుకోలేక పోయింది సోరాబ్జీ బాహాటంగానే ప్రవేశించాడు. ఆజ్ఞాపత్రాలను పరిశీలించే సరిహద్దు అధికారికి అతనితో పరిచయం వుంది. 'నేను పరీక్షార్థం స్వయంగా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిస్తున్నాను నా ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించ దలచుకుంటే మీరు పరీక్షించుకోవచ్చు నన్ను అరెస్టు చేయదలచుకుంటే, చేయనూ వచ్చు' ' అని సోరాబ్జీ అతనితో అన్నాడు మీకు ఆంగ్లం వచ్చునని నాకు తెలుసు అందువల్ల పరీక్షించాలన్న ప్రశ్నేరాదు. మిమ్మల్ని అరెస్టు చేయమన్న ఆజ్ఞ నాకు లేదు. కాబట్టి మీరు ఆనందంగా లోపలికి వెళ్ళవచ్చు మీరు ఎక్కడిక వెళ్ళినా, అరెస్టు చేయాలనుకున్నపుడు ప్రభుత్వమే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది అని అతను జవాబిచ్చాడు

అలా మా ఆశకు విరుద్ధంగా సోరాబ్జీ జోహాన్స్‌బర్గు వరకూ వెళ్ళి పోయాడు. మేమంతా ఆనందంగా అతణ్ణి ఆహ్వానించాం. ట్రాన్స్‌వాల్ సరిహద్దు స్టేషనైన వాక్స్‌రస్ట్ నుండి అడుగు ముందుకు వేయనివ్వకుండా ప్రభుత్వం అతణ్ణి అరెస్టు చేస్తుందని వూహించాము. మనమెంతో ముందు వెనుకలాలోచించి, నిర్భయంగా అడుగు ముందుకు వేసినప్పుడు ప్రభుత్వం దాన్ని నియంత్రించేందుకు సన్నద్ధంగా వుండకపోవటం తరచుగా జరుగుతూ వుంటుంది. ఇది ప్రతి విషయంలోను తమ ఆలోచనలను మొదటినుంచి వ్యవస్థీకరించుకుని, విపరీత పరిణామాలను ఎదుర్కొనేందుకు వీలుగా ఏ ప్రభుత్వాధికారీ సిద్ధంగా వుండకపోవటం యిలాంటి సాధారణ ఉద్యమ సమయాలలో జరుగుతూ వుంటుంది. అంతేగాక అధికారులకు ఒకటికి మించి అనేక పనులుంటాయి. ఆ పనులపై వారి దృష్టి వుంటుంది. పైగా అధికారులకు అధికార గర్వం కూడా వుంటుంది. ఇలాంటి ఉద్యమాల నెన్నింటినైనా అణిచివేయటం ప్రభుత్వానికి ఆటతో సమానమని వారికి నమ్మకం వుంటుంది. ఉద్యమం సాగించే కార్యకర్తలకు తమ లక్ష్యమేమిటో నిర్దిష్టంగా తెలిసి, దానికి అవసరమయ్యే సాధనాల గురించిన పరిజ్ఞానం వుంది, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని గురించి నిశ్చితాభిప్రాయం