పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

భారతజాతిపై క్రొత్త ఆరోపణ


పై విషయాలన్నీ వ్రాసినందుకొకటే కారణం ఎన్ని కష్టాల నడుమ మేమి సత్యాగ్రహ సమరాన్ని నడిపామో పాఠకులు తెలుసుకోవాలి నీతి బాహ్యంగా ఏ చిన్నపని చేసినా మా సమరం ఎలాంటి ఆపదలో చిక్కుకునేదో కూడా వారికి తెలియాలి ఇరవై అడుగుల ఎత్తైన వెదురు కర్రలతో కట్టబడినతాడుపై నడిచే మనిషి ఆ తాడుపైనే దృష్టినంతా కేంద్రీకరించి నడవాల్సి వస్తుంది ఈ పనిలో యిసుమంత అశ్రద్ధ చూపినా మృత్యువు నెదుర్కొనవలసి వుంటుంది. దక్షిణాఫ్రికాలో ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ సమరానుభవం వల్ల సత్యాగ్రహులు ఆ నటునికంటే ఎక్కువ ఏకాగ్రదృష్టితో నడచుకొనవలసిన అవసరం వుందని నాకు బోధపడింది. ఏ ఆంగ్లేయ మిత్రుల ముందు జనరల్ స్మట్స్ ప్రస్తావన తెచ్చారో, వారందరూ నా గురించి బాగా ఎరుగుదురు. అందుకే స్మట్స్ మాటల ప్రభావం వారిపై అందుకు వ్యతిరేకంగా పడింది. నన్నూ. యీ సమరాన్నీ, వదిలించుకునే ప్రయత్నం చేయకుండా వారు యింకా వుత్సాహంతో మాకు సహాయం చేయటానికి ముందుకు కొచ్చారు. వలస వచ్చేవారిని గురించిన చట్టాన్ని యీ సమరముసాయిదాలో కలపకపోతే మరిన్ని విపరీత పరిణామాలను ఎదర్కొనవలసి వస్తుందని సత్యాగ్రహులూ తెలుసుకున్నారు

ప్రతి సముచితమైన యుద్ధానికీ వృద్ధిచెందే నియమం వర్తిస్తుందని వ్యక్తిగత అనుభవం వల్ల నేను గ్రహించాను సత్యాగ్రహం విషయంలో ఇది సిద్ధాంతంగా మారుతుందని నా ఉద్దేశ్యం గంగానది ముందుకు సాగిన కొద్దీ అనేక నదులు దానితో కలుస్తున్నాయి. పోనుపోను దాని వైశాల్యం చూస్తే అటూ యిటూ ఒడ్డే కనిపించదు నావలో కూర్చున్న వ్యక్తికి సముద్రానికి గంగానదికీ తేడా కనిపించని స్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా సత్యాగ్రహసమరం ముందుకు సాగిన కొద్దీ, దానిలో అనేక విషయాలు కలిసి, దానివల్ల ఎదురయ్యే పరిణామాలను మరింత ఎక్కువగా ఎదుర్కొనవలసి వస్తుంది. నా ఉద్దేశ్యంలో సత్యాగ్రహంలో యీ పరిణామం అనివార్యం సత్యాగ్రహ మూల సిద్ధాంతంలోనే దీనికి కారణముంది. సత్యాగ్రహంలో