పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

233


భారతీయుల ప్రస్తావనేదీ అందులో లేదు. ట్రాన్స్‌వాల్‌ను రక్షించే దిశలో మనమీ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలనుకుంటున్న యీ సమయంలో యిప్పుడు సత్యాగ్రహం చేస్తామని అతడు మనల్ని బెదిరిస్తున్నాడు. ఈ గడసరితనాన్ని ఎప్పటిదాకా సహించగలం? అందుకే అతనేం చేస్తాడో చేసుకోనివ్వండి ప్రతి ఒక్క భారతీయుడూ నాశనమైపోయినా నేనీ ఆసియా చట్టాన్ని రద్దుచేయను రద్దు చేయను భారతీయులపట్ల ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం అనుసరించే పద్ధతిని నేనూ అనుసరిస్తాను న్యాయపూరితమైన నీతిదాయకమైన నాయీ అభ్యర్ధనసు ప్రతి శ్వేత జాతీయుడూ అంగీకరించాలి" అని తనతో యీ విషయమై చర్చించిన వారితోను ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన వారితోనూ ఆయన అంటూ వున్నాడు

కొంచెం ఆలోచిస్తే జనరల్ స్మట్స్ యొక్క యీ మోసపూరిత వ్యాఖ్య అనుచితమైనదని, నీతి బాహ్యమైనదని తోచక మానదు. కొత్తగా వచ్చే భారతీయులను నియంత్రించే చట్టమింకా పుట్టనే పుట్టనప్పుడు. నేను కానీ నాదేశ వాసులుకానీ దాన్ని ఎలా వ్యతిరేకిస్తాము? నా చాతుర్యం గురించి వారు ప్రస్తావిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఒక్క ఉదాహరణ సైతం వారు యివ్వలేకపోయారు. దక్షిణాఫ్రికాలో యిన్ని సంవత్సరాలుగా వుంటున్న నాకు గడసరి తనంతో పనులు చేసుకున్నట్లుగా గుర్తేలేదు. మరీ చెప్పాలంటే జీవితంలో గడసరి తనాన్ని ఎప్పుడూ నేను పుపయోగించనేలేదని, ఎలాంటి సంకోచమూ లేకుండా చెప్పగలను ఇలాంటి గడసరి తనం నీతి బాహ్యమే కాకుండా రాజనీతి విరుద్ధమైనదని కూడా నావిశ్వాసం. అందువల్ల నిత్యజీవనంలోకూడా యీ గడసరితనాన్ని వుపయోగించటానికి నేనెప్పుడూ యిష్టపడేవాణ్ణికాదు నన్ను నేను సమర్ధించుకునేందుకు యిలా వ్రాయటం లేదు ఏ పాఠకుల కోసం నేనీ చరిత్ర వ్రాస్తున్నానో వారిముందు నానోటితో నా చర్యలను సమర్ధించుకోవలసి రావటం సిగ్గుపడాల్సిన విషయంగా నేను భావిస్తాను ఇప్పటికీ పాఠకులకు నా స్వచ్చమైన స్వభావం గురించి, నిర్ధారణ కాకుండా వుంటే ఇక నేనెప్పటికీ యీ విషయాన్ని నిరూపించుకోలేననిపిస్తుంది.