పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

235


అప్పటి పరిణామమే అధికంగా వుంటుంది. దానిలో ఏరకమైన తగ్గింపూ చేయుటకు వీలువుండదు. ఇందువల్ల వెనక్కి మళ్ళీ అవకాశమే వుండదు స్వాభావికంగా, అది వృద్ధి చెందే తీరుతుంది. ఇతర సమరాలు ఎంత సముచితమైనవైనా వాటిలో కొంతకు కొంతైనా తగ్గించే ప్రమాదాన్ని ముందునుంచీ వూహించుకుని అందుకు సిద్ధంగా వుంటారు. అందువల్ల వాటిలో వృద్ధి యొక్క నియమం అమలులో వుంటుందని చెప్పటానికి సంకోచిస్తాను కానీ అల్పతమ విషయమే అధికతమంగా మారే అవకాశమున్న సత్యాగ్రహానికి వృద్ధి సూత్రం ఎలా వర్తిస్తుందన్న విషయమే అర్థంకావలసివుంది గంగానది తాను వృద్ధి చెందేందుకు సహాయక నదుల వేటలో పడి తన నడకను మరిచిపోని విధంగా సత్యాగ్రహుడు సైతం వృద్ధి కోసం కత్తిపదును గల తన మార్గాన్ని వదలటం కుదరదు. కానీ గుగానదీ ప్రవాహం ముందుకు సాగేకొద్దీ తక్కిన నదులన్నీ తమంత తామే ఆ ప్రవాహంలో కలిసిపోతాయి గంగా రూపమైన సత్యాగ్రహానిది అదే స్థితి ఈ వలస చట్టాన్ని సత్యాగ్రహ ముసాయిదాలో చేర్చిన తరువాత, ట్రాన్స్‌వాల్‌లోని భారతీయులకు విరుద్ధంగా వున్న అన్ని చట్టాలనూ యిలాగే చేర్చాలన్న అభిప్రాయాన్ని సత్యాగ్రహులు వెలిబుచ్చారు. ట్రాన్స్‌వాల్‌లో భారతీయుల సమరం జరుగుతుండగానే నేటాల్ కేఫ్‌కాలనీ ఆరేంజ్ ఫ్రీస్టేట్ మొదలైన చోట్ల వుండే భారతీయులనందరినీ ఆహ్వానించి దక్షిణాఫ్రికాలోని భారతీయులకు విరుద్ధంగా రూపాలదించిన అన్ని చట్టాలను వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేయించాలని మరి కొంతమంది అన్నారు. ఈ రెండు సందర్భాలలోనూ సత్యాగ్రహ సిద్ధాంతానికి భంగం వాటిల్లుతుంది. సత్యాగ్రహ ప్రారంభంలో మనము తలపెట్టిన విషయాలను అవకాశం చూసి యిప్పుడు పెంచడం, విశ్వాసపాత్రమనిపించుకోదని నేను స్పష్టంగా చెప్పాను. మన శక్తియుక్తులెంత ఉన్నతమైనవైనా, మనం ఏ డిమాండ్ల కోసం సత్యాగ్రహం చేస్తున్నామో వాటిని సాధించుకున్న తరువాత సత్యాగ్రహాన్ని నిలిపి వేయటమే మంచిది మనమీ సిద్ధాంతంపై స్థిరంగా నిలువలేనప్పుడు విజయానికి బదులు అపజయాన్ని పొందగలమని నా దృడ విశ్వాసం. అంతేకాదు మనం పొందిన సానుభూతిని కూడా కోల్పోవలసి