పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

227


అలజడి బయలుదేరింది సత్యాగ్రహారంభం నాటికి ఎవ్వరికీ భారత జాతి యొక్క శక్తిని గురించిన అంచనా లేదు. అప్పుడిలాంటి లేఖ యిలాంటి భాష అనుచితమైనదని తెల్లవాళ్లు భావించారు. కానీ యిప్పుడు భారత జాతి కొన్ని అగ్ని పరీక్షలను ఎదర్కొన్నది సామూహికంగా కష్టాలను ఎదుర్కొనటంలో కలిగే దు:ఖాన్ని భరించింది. అట్టి మహాశక్తి జాతికున్నదని అంతా అనుభవం మీద తెలుసుకున్నారు. అందుకే యీ నిర్ణయాత్మకమైన లేఖ స్వాభవికంగానే స్ఫూర్తి కలిగి వున్నది. పటిష్టమైన భాషలో జాతి దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని వెల్లడించింది




27

అనుమతి పత్రాల హోళీ

కొత్త ఏషియాటిక్ బిల్లు పార్టమెంటులో పాసయ్యె రోజున 'ఆల్టిమేటం' లేదా 'నిర్ణయషత్రం' యొక్క కాలవ్యవధి పూర్తికావలసి వుంది. గడువు పూర్తయిన రెండు గంటల తరువాత అనుమతి పత్రాలను తగులబెట్టే కర్తవ్యాన్ని పూర్తిచేసేందుకు ఒక సమావేశం ఏర్పాటుచేస్తూ అందరికీ ఆహ్వానాలు పంపాము దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించితే యీ సభ యీ పరిణామాన్ని జాతికి వినిపించేందుకు ఉపయోగ పడుతుందని సత్యాగ్రహ సమితి నిర్ణయించింది. కానీ, జాతి పంపిన పత్రానికి ప్రభుత్వం ఎలాంటి జవాబూ యివ్వదనే విశ్వాసంతో మేమంతా సభాస్థలికి, అనుకున్న సమయంకంటే ముందే చేరుకున్నాము తంతి ద్వారా ప్రభుత్వ నిర్ణయం ఏది తెలిసినా సభకు దాన్ని తెలిపేందుకు ఏర్పాట్లు మేము చేసుకున్నాము సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్ణయించాము అది జోహాన్స్‌బర్గ్‌లోని హమీదియా మసీదు మైదానంలో జరుగుతున్నది. 1908 ఆగస్ట్ 13వ తేదీ ఎటు చూచినా భారతీయులే ఇసుక వేస్తే రాలడం లేదని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికా యందలి హబ్షీలు వంట చేసుకునేందుకు నాలుగు కాళ్ళ ఇనుప