పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

యుద్ధం తిరిగి ప్రారంభం


మిత్రునికి నమస్కరిస్తాడు . రెండూ ఎదుటి వ్యక్తిని గౌరవించే పద్ధతులే కానీ, ఆ నమస్కరించే విధానాన్ని బట్టి మూడవ వ్యక్తి నమస్కరించిన వారిలో ఒక వ్యక్తిని, స్నేహితునిగాను గుర్తిస్తాడు రెండిటికీ గల తేడా యిదే ప్రభుత్వానికి యీ అల్టిమేటం పంపించే ముందు మామధ్య పెద్ద చర్చ జరిగింది గడువు నిర్ణయించాక. ప్రభుత్వం నుంచి, జవాబు పొందాలనుకోవడం అనాగరికం కాదా? అమర్యాదగా వుండదా. ప్రభుత్వం మన డిమాండును అంగీకరించాలనుకొని భావిస్తూ యీ విధంగా వ్రాయడం విపరీత పరిణామాలకు దారితీయదా" జాతి నిర్ణయాన్ని పరోక్షంగా తెలియజేస్తే చాలదా? ఇలాంటి అనేక సందేహాలపై చర్చించుకున్న తరువాతనే మేమంతో ఏకాభిప్రాయానికి వచ్చాము సత్యమైనది, న్యాయమైనదీ అనుకున్న పద్దతినే మేము అనుసరించాలని భావించాం అనాగరిక చర్య అన్న ఆరోపణను మాపై ప్రభుత్వం చేస్తే దాన్ని సైతం మేము ఎదుర్కొన వలసి వుంటుందని గుర్తించాం. ప్రభుత్వం యివ్వదలుచుకున్న సమాధానాన్ని ఉత్తుత్తికోపంతో మాకు పంపిన యెడల, ఆకష్టాల్ని ఎదర్కొనవలసి వుంటుందని గుర్తించాము మనిషిగా హీనత్వాన్ని అంగీకరించలేని పక్షంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొనగలిగే శక్తి మనలో వున్నదని మనం నమ్మే పక్షంలో సరైన చక్కనైన మార్గాన్నే ఎన్నుకొనడం అవసరమని భావించాం.

ఈ సారి భారతజాతి వేసిన అడుగులో ఒక నవ్యత్వం వైశిష్ట్యం వున్నదన్న సంగతి పాఠకులీపాటికి గ్రహించే పుంటారు. దీని ప్రతిధ్వని పార్లమెంటులోను బైట జరిగే తెల్లదొరల సభలల్లోనూ దద్దరిల్లింది. హిందూదేశ ప్రజల సాహసాన్ని కొందరు కొనియాడారు. కొందరు ఆగ్రహం వెలిబుచ్చారు భారతజాతి చూపిన ఉధృతానికి వారికి తగిన శిక్షను విధించాలని కొందరు ఆవేశపడ్డారు కూడా రెండు పక్షాలవారూ, తమ పద్ధతుల్లో, హిందూదేశ ప్రజల క్రొత్త ఎత్తుగడను గుర్తించారు అంగీకరించారు. సత్యాగ్రహ ప్రారంభంలో అది నిజానికి మొదటి అడుగే అయినా అప్పుడు ఆంగ్లేయ ప్రజల్లో ఏర్పడిన కల్లోలం అపరిమితం యీ లేఖవల్ల వారిలో అమితంగా