పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

అనుమతి పత్రాల హోళీ


బాణీలను ఉపయోగిస్తారు అనుమతి పత్రాలను తగులబెట్టేందుకై. వీలైనంత పెద్ద బాణీలను ఓ హిందూ వ్యాపారి దుకాణం నుంచి తెప్పించారు. వాటిని వేదికపై ఓ మూల పెట్టి వుంచారు

సభ ప్రారంభమవుతున్నది. అంతలో ఓ స్వయం సేవకుడు సైకిల్‌పై సభాస్థలికి వచ్చాడు. అతని చేతిలో ఓ టెలిగ్రాం వుంది అందులో ప్రభుత్వం యొక్క ప్రత్యుత్తరం వున్నది హిందూ దేశప్రజల నిర్ణయానికి ఖేదం వ్యక్తం చేస్తూ, తమ నిర్ణయాన్ని మార్చుకోలేమన్న అసహాయతను తెలియబరుస్తున్నట్లు అతంతిలో వున్నది. దాన్ని సభలో వున్న అందరికీ చదివి వినిపించాము తమకు అనుకూలంగా ప్రభుత్వం స్పందిస్తే, యీ అనుమతి పత్రాలను తగులబెట్టే సువర్ణావకాశం తమ చేతుల్లోంచి జారిపోతుందేమోనని అక్కడి ప్రజలు అనుమానించి అది వాస్తవం కాకపోయే సరికి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సంతోషం ఉచితమో, అనుచితమో చెప్పటం చాల కష్టం ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని కరతాళధ్వనుల ద్వారా ఆహ్వానించిన ప్రజల ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోకుండా దానిపై ఉచితానుచిత నిర్ణయం తీసుకోవటం అసాధ్యం కానీ యీ ఆనందం సభలోని ప్రజల ఉత్సాహానికి మంచి చిహ్నమని మాత్రం చెప్పవచ్చు. సభికులకు తమ శక్తి సామర్థ్యాలను గురించిన కొద్ది అనుభవం కలిగింది

సభాకార్యక్రమం మొదలైంది సభాధ్యక్షులు పరస్థితిని వివరించి, వాస్తవాన్ని ప్రజలకు తెలియబరిచారు. అవసరానికి అనుగుణంగా తీర్మానాలు చేయబడ్డాయి. ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ సంభాషణల్లో ఎదురైన విభిన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ నేను ప్రసంగించాను అనుమతి పత్రాలను కాల్చివేసేందుకు మాకు యిచ్చిన వారితో ఎవరైన తమ వాటిని వెనిక్కి తీసుకొన దలిస్తే, తీసుకోవచ్చుననీ, యిలా కాల్చివేసినంత మాత్రాన ఏదో గొప్ప పని జరగదని తెలియజేశాము ఈ పని చేసినంత మాత్రంచేత, జైలుకెళ్ళి రావచ్చునని ఉత్సాహపడే వారికి జైలు శిక్ష పడదు. ఈ పనిచేసి, ప్రభుత్వపు దగుల్బాజీ చట్టం ముందు లొంగిపోయేది లేదన్న మన