పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

225


పరిగణించటం, హిందూదేశ ప్రజలను తమ వంటివారుగా పరిగణించిన పక్షంలో యీ లేఖను వారు సంస్కార పూరితమైనదిగా భావించి, దానిపై దృష్టిని కేంద్రీకరించి యుండేవారు. తమను ఆటవిక ప్రజలుగా ఆంగ్ల ప్రభుత్వం వారు పరిగణిస్తున్నారని తెలుసుకొని హిందూదేశ ప్రజలు యీ లేఖ ప్రభుత్వానికి వ్రాశారు రెండు పరిస్థితులలో సుంచి ఏదో ఒక స్థితిని వారు అంగీకరించవలసి వచ్చింది ఒకటి మేము ఆటవికజాతి ప్రజలము అని అంగీకరించి, తెల్లవాళ్ల కాళ్ల క్రింద పడి వుండటం - రెండు - ఆటవిక జాతిగా అంగీకరించము అని చెప్పి ఆడుగు ముందుకు చేయటం రెండవ అడుగే యీ ఉత్తరం యొక్క లక్ష్యం ఈ లేఖ వెనుక తమ నిర్ణయాన్ని అమలు చేస్తామనే దృఢ నిశ్చయం వెల్లడించి యుండకపోతే అది వారి తొందర పాటుచర్యగాను, యోచనా శూన్యమైన నిర్ణయంగాను తెల్లవాళ్లు పరిగణించేవారు

సత్యాగ్రహ సంకల్పం జరగినప్పుడు భారతప్రజల ప్రతిజ్ఞ బూనటమే తమను ఆటవిక జాతిగా అంగీకరించము అని వేసిన మొదటి అడుగు కదా అని పాఠకుల మనసుల్లో సందేహం తలెత్తవచ్చు. అదే నిజమైతే యింత ప్రాధాన్యత యివ్వవలసిన క్రొత్త విషయం యీ లేఖలో ఏముందని పాఠకులకు అనిపించవచ్చు. ఒక విధంగా యీ తర్కమూ సత్యమైనదే' కానీ దీన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తే, జాతి నిర్ణయం ఆ పత్రంలోనే స్పష్టంగా వున్నదని తెలుస్తున్నది. సత్యాగ్రహ ప్రతిజ్ఞ హఠాత్తుగా జరిగిన సంఘటనగా పాఠకులకు జ్ఞాపకం వుండే వుంటుంది. తరువాత జైలు శిక్ష వంటివి దాని పరిణామరూపాలే! అందువల్ల అనుకోకుండానే జాతి ప్రతిష్ట పెరిగింది. కానీ యీ లేఖ వ్రాసే సమయంలో జాతి చాలా అప్రమత్తంగా వున్నది. పైగా తమ ప్రతిష్టకోసం చేయుటకు భారత జాతి నిర్ణయం తీసుకున్నది. ఈ దగుల్బాజీ చట్టాన్ని రద్దు చేయించటమే. దాని ధ్యేయం కానీ యీ లేఖలో ప్రయోగింపబడిన భాషాశైలిని, అవలంబించవలసిన పద్ధతిని నిర్ణయించడంలో జాగ్రత్త వహించాము. యజమానికి నమస్కరిస్తాడు. ఒక స్నేహితుడు తన