పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

213


చెప్పుకోవాలంటే చలాకీవాడు అనవచ్చు. కొంతమంది ఆంగ్ల స్నేహితులు నాతో జనరల్ స్మట్స్‌తో కాస్త జాగ్రత్తగా వుండు చాలా చాతుర్యం గలవాడు నిముషాల్లో మారిపోయే మనస్తత్వ మతనిది అని చెప్పారు. వారి మాటల అర్థం స్పష్టంగా వున్నది. వారిది. ఇరుపక్షాలవారికీ నచ్చేవిధంగా మాట్లాడే చాతుర్యం ఇదేకాక తమ మాటలకు మూడో అర్థం కూడా చెప్పి, దానికి అనుకూలంగా చర్యలు తీసుకోగలరు కూడా తమ మాటలను చక్కగా సమర్థించుకోగలరు. అప్పుడిక జరుపక్షాల వారూ వారి మాటలను తామే సరిగా అర్థం చేసుకోలేక పోయామని స్మట్స్ ఆడిన మాటలకు ఆయన చెప్పిన అర్థమే సరైనదనీ సమాధానపడి పోతారు అని కూడా చెప్పారు. ఈ ప్రకరణంలో నేసువర్ణించబోతున్న సంఘటనను అప్పట్లో నమ్మకద్రోహం అని పరిగణించాము ఇప్పటికీ దేశభక్తి దృష్టితో చూస్తే దీన్ని నమ్మకద్రోహమనే నేను అంటాను. ఇంతేకాకుండా యీ ప్రకరణ శీర్షికయందు ప్రశ్నార్థకాన్ని వుంచాను కారణం - వాస్తవానికి యీ పని జనరల్ స్మట్స్ కావాలని చేసిన విశ్వాస ఘాతుకం కాదేమోననే ఈ ఘాతుకం చేయాలన్న సంకల్పం లేనప్పుడు దాన్ని విశ్వాస భంగమని ఎలా అనగలం? 1913-14 మధ్యకాలంలో జనరల్ స్మట్స్ వల్ల కలిగిన అనుభవాన్ని అప్పట్లో నేను చేదైనదిగా భావించలేదు. అప్పటికంటే ఎక్కువ తటస్థంగా ఆలోచించగలిగే యీనాడు కూడా, దాన్ని చేదు అనుభవమని ఆనుకోవటం లేదు. 1908లో భారతీయుల పట్ల జనరల్ స్మట్స్ వ్యవహరించిన తీరు కూడా ఉద్దేశ్యపూర్వకంగా చేసిన విశ్వాస ఘాతుక చర్య కాదేమో అని అనిపిస్తుంది

ఈ వివరణ అంతా యివ్వటానికి ఒక కారణం వుంది. జనరల్ స్మట్స్ పట్ల న్యాయంగా వ్యవహరించటానికీ, యీ ప్రకరణం శీర్షికలో అతని పేరుతోపాటు విశ్వాస నమ్మకద్రోహమనే పదం వాడటానికీ యీ ప్రకరణంలో నేను చెప్పదలచుకున్న విషయాన్ని సమర్థించుకోవటానికి పై వివరణ యివ్వవలసి వచ్చింది

ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి భారతీయులు స్వచ్చందంగా లొంగిపోయి తృప్తి