పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?


కలిగించిన వైనాన్ని గత ప్రకరణంలో చూశాం ఇక యిప్పుడు ప్రభుత్వం, ఖూనీ చట్టాన్ని రద్దు చేయవలసి వుంది. అలా చేస్తే సత్యాగ్రహ యుద్ధం ఆగిపోతుంది అంటే ట్రాన్స్‌వాల్ ప్రభుత్వంలో భారతీయులకు వ్యతిరేకంగా వున్న అన్ని చట్టాలూ రద్దయిపోతాయనో లేదా భారతీయుల బాధలన్నీ దూరమైపోతాయనో అనుకోకూడదు. ఆ పరిస్థితి రావాలంటే ముందులాగే చట్టపరమైన యుద్ధాన్ని కొనసాగించ వలసిందే నల్లటి భయంకరమైన మేఘాన్ని పోలిన ఖూనీ చట్టాన్ని రద్దు చేయించడమే యీ సత్యాగ్రహ ఉద్దేశ్యం ఈ చట్టాన్ని అంగీకరిస్తే అది దేశానికే కళంకమౌతుంది. దీనివల్ల ముందు ట్రాన్స్‌వాల్‌లోనూ, తరువాత దక్షిణాఫ్రికా మొత్తం నుంచే భారతీయుల ఉనికియే నశించవచ్చు. కానీ యీ ఖూనీ చట్టాన్ని రద్దు చేసేందుకు బదులు, జనరల్ స్మట్స్ కొత్త ఎత్తుగడ వేశారు. విధానసభలో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా అటు హత్యానేర చట్టాన్ని యధాతధంగా వుంచి తమ యిష్టం మేరకు తీసుకున్న అనుమతి పత్రాలను చట్టబద్ధం చేశాడు. దాంతోపాటు బిల్లులో ఓ కొత్త అంశం (సెక్షన్) చేర్చాడు యిచ్ఛాపూర్వకంగా ఆజ్ఞా పత్రాలను పొందిన భారతీయులపై ఖూనీ చట్టాన్ని అమలు పరచనవసరం లేదన్నదే ఆ అంశం ఒకే విషయానికి సంబంధించిన రెండు చట్టాలు అమలులో వుండటం యిందలి విశేషం ట్రాన్స్‌వాల్‌లోకి క్రొత్తగా ప్రవేశించే భారతీయులకి లేదా కొత్తగా ఆజ్ఞాపత్రాలను పొందగోరే భారతీయులకి యీ ఖూనీ చట్టం వర్తిస్తుందన్నమాట

ఈ కొత్త బిల్లును చదివి నేను బిత్తరపోయాను జాతికి నేనేం జవాబు చెప్పేది? జోహన్స్‌బర్గ్‌లో అర్ధరాత్రి జరిగిన సభలో నాపై భయంకరమైన ఆరోపణలు చేసిన పరాన్ సోదరులకు ఎంతో మంచి విందు భోజనం దొరికింది కానీ యీ దెబ్బతో సత్యాగ్రహం పట్ల సడలిపోవలసిన నా విశ్వాసం మరింత దృఢమైందని చెప్పక తప్పదు. మా కమిటీ సభ్యులను పిలిపించి, తాజా పరిస్థితిని వివరించాను నాపై కొందరు ఒక విసురు విసిరారు కూడా మీరు అమాయకులని మేము చెబుతూనే వున్నాం ఎవరేం చెప్పినా దాన్ని