పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?


25

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?

మా ఆంతరంగిక యిబ్బందులను గురించి పాఠకులు కొంతవరకు గ్రహించే వుంటారు. వాటిని వర్ణించునప్పుడు ఎక్కువగా నా ఆత్మ కధనే చెప్పవలసి వచ్చింది. సత్యాగ్రహానికి సంబంధించిన నా యిబ్బందులే నాతోటి సత్యాగ్రహలకీ ఎదురైనందున యిది అనివార్యమైంది. ఇప్పుడు మళ్ళీ మనం బైటి యిబ్బందుల గురించి చర్చించుకుందాం

ఈ ప్రకరణానికి శీర్షిక పెట్టేటప్పుడు నాకు సిగ్గువేసింది. ఈ ప్రకరణం వ్రాసేటప్పుడూ సిగ్గనిపించింది. కారణం . దీనిలో మానవ స్వభావపు వక్రతను గురించిన వర్ణన వుంది. 1908లో జనరల్ స్మట్స్ దక్షిణాఫ్రికాలో కల్లా తెలివైన నాయకుడిగా చలామణి అయ్యేవారు. ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తంమీద కాకపోయినా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నత శ్రేణికి చెందిన కార్యకుశలునిగా పరిగణింప బడుతున్నారు. వారి మహోన్నత శక్తి కుశలత పట్ల యోగ్యతల పట్లా నాకు సందేహం లేదు

వకీలుగా వారెంత కుశలురో సేనాపతి గానూ, శాసకులుగానూ అంతే నిపుణులు దక్షిణాఫ్రికాలో ఇతర అధికారులు ఎందరో వచ్చారు వెళ్ళారు కానీ 1907 మొదలుకొని యీనాటివరకూ దక్షిణాఫ్రికా ప్రభుత్వపు పగ్గాలు వీరి చేతుల్లోనే వున్నాయి. ఈ రోజు వరకు కూడా వీరితో పోటీపడ్ నిలువగలిగే నాయకుడే దక్షిణాఫ్రికాలో లేడు ఈ ప్రకరణం వ్రాసే సమయానికి, నేను దక్షిణాఫ్రికాను వదలి తొమ్మిది సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికా ప్రజలు జనరల్ స్మట్స్‌ను ఏ విశేషణాలతో సుబోధిస్తూన్నారో నాకు తెలియదు. జేన్ అన్నది వారి సొంత (క్రిస్టియన్) నామధేయం దక్షిణాఫ్రికా ప్రజలు వారిని స్లిమ్‌జేనీ అని సంబోధిస్తారు స్లిమ్ అంటే జారిపోయే లేక పట్టుబడని అని అర్థం గుజరాతీ భాషలో హిందీలోనూ దీనికి దగ్గరగా వున్నపదం ధూర్తుడు కాస్త తియ్యగా