పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

211


అంతా సేవకులేనని చెప్పవచ్చు. అందువల్ల ఎంత గొప్ప వ్యక్తి సత్యాగ్రహంలో మృతి చెందినా సత్యాగ్రహ సమరం శక్తిని కోల్పోదు. సమర వేగాన్ని అమితంగా పెంచుతుంది.

ఇదే సత్యాగ్రహం యొక్క శుద్ధమైన మూలస్వరూపం కాని మనం అనుభవంలో యిట్టి దానిని చూడటం లేదు అందరూ వైరాన్ని, అసహ్యాన్ని త్యజించలేక పోవడమే అందుకు కారణం ప్రత్యక్ష అనుభవం ద్వారాను, ఆచరణ రూపంలోను జనం సత్యాగ్రహ రహస్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు కొందరి ఆచరణను చూచి చాలా మంది మూర్ఖంగా వాళ్లను అనుసరిస్తున్నారు అసలు ట్రాన్స్‌వాల్‌లో చేయబడ్డ సామూహిక, సాంఘిక సత్యాగ్రహం యొక్క ప్రయోగం, టాల్‌స్టాయి. అభిప్రాయం ప్రకారం మొట్టమొదటిది నేను స్వయంగా చారిత్ర్యాత్మికంగా శుద్ధ సత్యాగ్రహానికి ఒక్క ఉదాహరణనైనా చూచియుండలేదు చరిత్రను గురించి నాకు తెలిసినది తక్కువే కనుక యీ విషయంలో నేను ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోతున్నాను. అటువంటి ఉదాహరణలతో మనకు సంబంధం కూడా లేదు. సత్యాగ్రహం యొక్క మూలసిద్ధాంతాల్ని అంగీకరిస్తే, నేను చెప్పిన ఫలితాలు లభించి తీరుతాయి సత్యాగ్రహ ప్రయోగం సాధ్యం కాని పని అని, దాన్ని అమలు చేయడం కష్టమని చెప్పి సత్యాగ్రహం యొక్క అమూల్యమైన శక్తిని వదిలివేయకూడదు శస్త్రాస్త్రాల ప్రయోగం వందలాది సంవత్సరాల నుంచి జరుగుతూనే వున్నది దాని కటుఅనుభవాలు కండ్లారా మనం చూస్తూనే వున్నాం భవిష్యత్తులో సైతం దానివల్ల మధురఫలితాలు లభిస్తాయని అనుకోవడం సరికాదు అంధకారంలో నుంచి వెలుగును ఉత్పన్నం చేయకలిగితేనే, వైరభావాన్నుంచి ప్రేమ భావాన్ని ప్రకటింప చేయవచ్చు.