పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

ఆంతరికమైన తీవ్రకలహాలు


అవసరమే కదా యీ విషయాన్ని ప్రభుత్వాలు కూడా అంగీకరించక తప్పలేదు. అపోహలకు గల తావు నిజానికి బహుతక్కువ అయినా అది ఉగ్రరూపం దాల్చింది. పరాన్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు, వారు హింసామార్గాన్ని అవలంభించినప్పుడు జాతి ప్రజల్లో అలజడి వ్యాపించింది నిజానికి అందు ఆపోహలకు తావే లేదు. అందు అనుమానాలకు పునాదియే లేదు. అటువంటి గొడవలు క్షణికంగానే జరుగుతాయి. అయినా ప్రపంచంలో అట్టివాటికి కూడా శక్తి వుంటూనే వున్నది. రక్తపాతం అన్నా, హింస అన్నా మనం వణికి పోతూ వుంటాం ధైర్యం వహించి ఆలోచిస్తే యిట్టి హింసను చూచి భయపడనక్కరలేదు ఒక్క విషయం మీర్‌ఆలం, అతడి అనుచరులు చేసిన దాడికి గాయపడటానికి బదులు నా శరీరం నష్టపడిపోయివుంటే, భారతజాతి యీ విషయం గమనించి కూడా నిశ్చింతగా, ప్రశాంతంగా వుండివుంటే, మీర్‌ఆలం తన బుద్ధి ద్వారా కేవలం హింసాపూరితంగా వ్యవహరించాడని భావించి, అతణ్ణి మిత్రభావంతో క్షమించియుంటే, జాతికి నష్టమేమీ కలిగి యుండేదికాదు. అట్టి ఉదాత్తమైన ఉదారమైన ఆచరణవల్ల జాతి గొప్పతనం పెరిగిపోయి వుండేది. జాతి అపోహలన్నీ పటాపంచలైపోటు వుండేవి. అది ద్విగుణీకృత ఉత్సాహంతో తన ప్రతిజ్ఞపై నిలిచి యుండేది. నాకు నిజంగా ఎంతో లాభం కలిగి యుండేది సత్యాగ్రహ విషయంలో సత్యానికి కట్టుబడి, సత్యనిష్ఠతో సునాయాసంగా అందునిమిత్తం సత్యాగ్రహి ప్రాణం పోగొట్టుకోవలసి వస్తే అంతకంటే మించిన మంగళకరమైన పరిణామం మరింకొకటి ఉండదు అది నిజంగా సత్యాగ్రహి యొక్క విజయమే

పైన తెలిపిన కారణాలు సమర్థనలు కేవలం సత్యాగ్రహం వంటి పోరాటానికే వర్తిస్తాయి. అందువైరానికి, అసహ్యానికి తావు వుండదు ఆత్మశక్తి లేక స్వావలంబనమే దాని ఏకైక సాధనం అందు ఎవ్వరూ మరొకరి సాయం కోసం ఆశగా ఎదురు చూడరు అందు నాయకుడు వుండడు సేవకుడుగాని, అనుచరుడుగాని ఎవ్వడూ వుండడు. అందు వుండేది అంతానాయకులే