పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

సహాయకులుగా వున్న తెల్లవారు


అనుచరులుగాలేరు. తరువాత పేర్కొనవలసిన వారు హర్మన్ కేలన్‌బెక్ జాతీయ సంగ్రామం జరుగక ముందే వారితో పరిచయం ఏర్పడింది. వారు జర్మనీ వారు ఆంగ్లేయులకు, జర్మన్లకు మధ్య యుద్ధం జరిగి యుండకపోతే కేలన్ బెక్ ఇండియాలో వుండి వుండేవారు. వారు విశాలహృదయులు సరళ హృదయులు గొప్ప అమాయకులు తీవ్ర భావాలు గల వ్యక్తి శిల్పిగా పని చేస్తూ వుండేవారు ఎంత చిన్న పని అయినా సంకోచించకుండా చేస్తూ వుండేవారు. జోహన్స్ బర్గ్‌లో నేను వున్నయిల్లు పడగొట్టినప్పుడు యిద్దరం కలిసి వుండేవాళ్లం నా ఖర్చుకూడా వారే భరించేవారు. వారికి యిల్లువుండేది భోజనం ఖర్చు యిస్తానని నేను వారితో అనగానే కోపపడి గాలికి తిరుగుతూ గాలి ఖర్చులు చేస్తూ వుండే నన్ను సరిదిద్దింది. మీరేనండీ అని నా కోరికను నిరాకరిస్తూ వుండేవారు. వారు అన్న మాట నిజమే అయితే తెల్లవారితో నాకు గల వ్యక్తిగత సంబంధాల్ని గురించి యిక్కడ వ్రాయను సత్యాగ్రహుల కుటుంబాల వారందరినీ జోహన్స్‌బర్గ్‌కు రప్పించి ఒకే చోట వుంచాలని నిర్ణయం చేయగానే కేలన్ బెక్ అద్దె తీసుకోకుండా తన 1100 బీఘాల (బీఘా అంటే 120 చదరపు అడుగుల స్థలం) భూమిని ఉపయోగించుకోమని యిచ్చి వేశారు. గోఖలే గారు దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు భారత జాతి పక్షాన, శ్రీ కేలన్ బెక్ గారి బంగళాలో వారికి నివాసం ఏర్పాటు చేశారు. ఆ బంగళా గోఖలే గారికి ఎంతో నచ్చింది. వారికి వీడ్కోలు చెప్పుటకు కేలన్ బెక్ నాతోబాటు జాంజిబార్ దాకా వచ్చారు యుద్ధం ప్రారంభం కాగానే శ్రీ పోలక్‌తో బాటు కేలన్ బెక్‌ను కూడా అక్కడి ప్రభుత్వం వారు నిర్బంధంలోకి తీసుకున్నారు. వారు కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది దక్షిణాఫ్రికా వదిలి గోఖలే గారిని కలుసుకునేందుకు నేను ఇంగ్లాండు వెళ్లినప్పుడు శ్రీ కేలన్ బెక్ నా వెంట వున్నారు. ప్రధమ మహాయుద్ధం కారణంగా వారిని ఇంగ్లాండు నుంచి నాతో బాటు ఇండియాకు రానీయలేదు యితర జర్మనీ వారందరి మాదిరిగా కేలన్ బెక్ గారిని కూడా ఇంగ్లాండులో నిర్బంధంలో వుంచారు. యుద్ధం ముగిసిన తరువాత వారు జోహన్స్‌బర్గ్ వెళ్లి పోయారు. తన శిల్పం పనిని వారు తిరిగి ప్రారంభించారు