పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

197


గాంధీకి సహకరించి ఆశ్రమాన్ని నడిపించారు. ఇండియన్ ఒపీనియన్ పత్రిక మరియు ప్రెస్సు పని వెస్ట్ చూస్తూ వుండేవాడు. నేను లేని సమయాల్లో డర్బన్ నుంచి గోఖలేగారికి పంపవలసిన టెలిగ్రాములు వెస్ట్ పంపుతూ వుండేవారు. చివరికి వెస్ట్ కూడా అరెస్ట్ చేయబడ్డారు. (అయితే ఆయనను త్వరగా విడుదల చేశారు) అప్పుడు గోఖలే కంగారు పడిపోయారు. వెంటనే వారు. ఇండియానుంచి ఆండ్రూస్ మరియు పియర్సన్‌ను దక్షిణాఫ్రికా పంపించారు

మరో సహాయకుడు శ్రీరిచ్ వీరిని గురించి ముందే వ్రాశాను వారు సత్యాగ్రహసమరం ప్రారంభంకాక పూర్వం నుంచే నా ఆఫీసులో పని చేయడం ప్రారంభించారు. నేను లేనప్పుడు నా పని సంభాళించాలనే ఉద్దేశ్యంతో బారిష్టరీ చదువుటకు ఆయన ఇంగ్లాండు వెళ్లాడు. అక్కడ సౌత్ ఆఫ్రికన్ బ్రిటిష్ ఇండియన్ కమిటీ, లండన్ వ్యవహారబాధ్యతను కూడా ఆయనే స్వీకరించారు

మూడవ సహాయకులు శ్రీ పోలక్ వెస్ట్ వలెనే పోలక్‌తో పరిచయం కూడా భోజనశాలయుందే కలిగింది. వారు దిట్రాన్స్‌వాల్ క్రిటిక్ అనుపత్రికకు ఉపసంపాదకులుగా పనిచేస్తూ వుండేవారు. దాన్ని హఠాత్తుగా వదిలివేసి ఇండియన్ ఒపీనియన్ పత్రికకోసం వచ్చి వేశారు. వారు సత్యాగ్రహసమరం సాగుతున్నప్పుడు ఇంగ్లాండు, భారతదేశాల్లో విస్తారంగా పర్యటించారు. రిచ్ ఇంగ్లాండు వెళ్లినందున, నేను పోలక్‌ను ఫినిక్స్ నుంచి జోహన్స్‌బర్గ్‌లో గల నా ఆఫీసుకు పిలిపించుకున్నాను అక్కడ మొదట ఆయన ఆర్టికల్డ్ క్లార్కుగా పని చేసి తరువాత పూర్తి వకీలు అయిపోయారు కొద్ది సమయం గడిచాక వారు వివాహం చేసుకున్నారు. శ్రీమతి పోలక్ సేవలను గూడా భారతదేశం గుర్తించింది. ఆమె సత్యాగ్రహసమరం సాగినప్పుడు తన భర్తకు ఎంతో సహాయం చేసింది. ఒక్కరోజు కూడా విఘ్నం కలుగ నీయలేదు. పోలక్ దంపతులు యిప్పటికీ భారతావనికి ఎంతో సేవ చేస్తున్నారు. అయితే భారతదేశంలో సాగిన సహాయ నిరాకరణోద్యమంలో వారు మాకు