పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

199

ఇక పాఠకులకు ఒక పవిత్ర మహిళను పరిచయం చేస్తాను. గోఖలే ఆమెకిచ్చిన సర్టిఫికెట్టును గురించి పాఠకులకు చెప్పాలనే కుతూహలాన్ని ఆపుకోలేక పోతున్నాను. ఆమె పేరు కుమారి సోనజాశ్లెసిన్ మనుష్యుల్ని గుర్తించే ఒక అద్భుతశక్తి గోఖలేగారికి వున్నది బేలాగోవావే, నుంచి జాంజిబార్ దాకా నేను వారి వెంట వెళ్లాను. అప్పుడు నాకు ప్రశాంతంగా వారితో మాట్లాడుటకు అవకాశం దొరికింది దక్షిణాఫ్రికా యందలి భారతీయులతోను, తెల్లజాతినాయకులతోను కూడా వారికి సత్సంబంధం ఏర్పడింది. వారిలో చాలా మంది వ్యక్తిత్వాన్ని గురించి వారు నాకు వివరించి చెప్పారు. అప్పుడు వారు భారతీయులు, ఆంగ్లేయులు అందరిలోను ప్రధమస్థానం కుమారి శ్లెసిన్‌కు యిచ్చారు. "శ్లెసిన్ వంటి నిర్మలమైన అంతఃకరణంగల ఏకాగ్రతగల, స్థిరనిర్ణయంగల శక్తిని బహుకొద్ది మందిలోనే చూచాను ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించకుండా భారతజాతీయ సంగ్రామంకోసం సర్వార్పణం ఆమె చేయడం చూచి నివ్వెరపోయాను, ఆమె దీక్ష ఆమెస్పూర్తి, అమె సామర్థ్యం మీ సత్యాగ్రహ సమరానికి ఎంతో ఉపకరిస్తాయి. ఆమె మీకు మంచి సేవికగా ఉపయోగపడుతుంది. నేను చెప్పవలసిన అవసరం లేకపోయినా చెబుతున్నాను మీరు ఆమెను మీ దగ్గరే నియమించుకోండి" అని చెప్పారు

నా దగ్గర ఒక స్కాచ్ కుమారి మిస్‌డిక్ స్టెనో టైపిస్టుగా పని చేస్తువున్నది ఆమె నిజాయితీ, నైతిక శక్తి అమోఘం జీవితంలో చాలా కటు అనుభవాలు నాకు కలిగాయి. అయినా నాకు పరిచయం అయిన భారతీయులు, ఆంగ్లేయులు, యితర దేశాలవారు మహాకోవకు చెందినవారని చెప్పగలను అది నా అదృష్టమే, ఆమెకు వివాహం జరిగినప్పుడు నన్ను వదిలి వెళ్లి పోయింది. అప్పుడు శ్రీ కేల్‌బెక్ కుమారి శ్లెసిన్‌ను తీసుకు వచ్చి పరిచయం చేశారు. "ఈమెను యీమె తల్లి నాకు అప్పగించింది. యీమె తెలివిగలది. నమ్మతగిన అమ్మాయి అయితే కొంటెతనం ఎక్కువ. స్వతంత్ర భావాలుగల స్వభావం, అయినా వరవాలేదు. మీరు యీమెకు పని అప్పగించవచ్చు. జీతం కోసం యీమెను మీ దగ్గర వుంచడం లేదు అని చెప్పారు. శ్రీకేల్‌బెక్.