పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

సహాయకులుగా వున్న తెల్లవారు

కుమారి శ్లెసిస్ కొంటెతనం ఎలా వుంటుందో నాకు బోధపడింది. అయితే ఒక్క నెల రోజుల్లో ఆమె నన్ను తనవశం చేసుకున్నది పగలుగాని, రాత్రిగాని ఎప్పుడైనా సరే పని చేయుటకు సిద్దంగా వుండేది. ఆమెకు కష్టమైన పని అంటూ ఏమీ వుండేది కాదు. అప్పుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలు పవిత్రత, స్పష్టత, సేవానిరతి ద్వారా ఆమె నన్నే గాక నా కక్షిదారుల్ని. సత్యాగ్రహుల్ని సైతం ప్రభావితం చేసింది. ఆ కుమారి నా ఆఫీసుకే గాక, జాతీయ సమరానికి కూడా రక్షకురాలుగా నిలిచింది. ఏ విషయమైనా సరే. నైతికంగా తనకు నచ్చకపోతే నాతో చర్చకు దిగేది. నేను అందలి నైతిక విలువలను గురించి ఆమెకు నచ్చ చెప్పనంత వరకు ఆమె తృప్తి పడేది కాదు

సేఠ్ కాఛలియా దప్ప మిగతా వారంతా జైళ్లకు వెళ్లిపోయారు అప్పుడు కుమారి శ్లెసిన్ లక్షలాది రూపాయలకు కాపలా కాయడమే కాక, జమా ఖర్చుల విషయమై కూడా శ్రద్ధ వహించి పని చేసింది. కాఛలియా కూడా ఆమె సహాయం పొందేవాడు ఆమె సలహా ప్రకారం పని చేసేవాడు మేమంతా జైలుకు వెళ్లినప్పుడు శ్రీ డోక్ ఇండియన్ ఒపీనియన్ పత్రికా భారం వహించారు. జుట్టు తెల్లబడి పోయిన డోక్ వంటి అనుభవజ్ఞుడు కూడా ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం తను వ్రాసిన వ్యాసాల్ని కుమారి శ్లెసిన్ చేత ఓకె చేయించుకొనేవాడు. కుమారి శ్లెసిన్ లేక పోతే నా పని మీదనాకే విశ్వాసం పోయి వుండేది. ఆమె యిచ్చే సలహాలు సూచనలు అమితంగా ఉపయోగపడేవి. అనేక పర్యాయాలు ఆమె చేసిన మార్పులు బాగా వున్నాయని విశ్వాసం కలిగి నేను పత్రికకు ప్రచురణ నిమిత్తం పంపేవాణ్ణి" అని డోక్ నాకు చెప్పారు. పరాన్లు, పటేళ్లు, గిర్‌మిట్ ప్రధనుంచి ముక్తి పొందిన భారతీయులు ఎప్పుడూ కుమారీ శ్లెసిన్ చుట్టూ మూగి వుండేవాళ్లు ఆమె సలహాలు తీసుకొని పని చేస్తూ వుండేవాళ్లు

దక్షిణాఫ్రికా యందలి రైళ్లలో తెల్లజాతి వారు భారతీయుల ప్రక్కన కూర్చొని ప్రయాణం చేసేవారు కాదు. ట్రాన్స్‌వాల్‌లో తెల్లవాళ్లు దాన్ని నియమంగా పెట్టుకున్నారు. సత్యాగ్రహులు నియమప్రకారం రైళ్లలో మూడో