పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ఒడంబడికకు వ్యతిరేకత


దాడిచేయక పూర్వం ఆరు మాసాల క్రితం ఒకసారి వారు నా ఆఫీసు వచ్చారు నా దగ్గరకి తమ పేరు పంపించారు ఆందురెవరెండ్ అను విశేషణం వ్రాసి వున్నది. అది చూచి పొరపాటుగా అభిప్రాయం నాకు కలిగింది. కొందరు పాదరీలు నన్ను క్రైస్తవుణ్ణిగా మార్చాలని లేక సత్యాగ్రహ సమరం ఆపు చేయమని చెప్పడానికి ఆశ్రయ దాతల రూపంలో జాతిసాగిస్తున్న పోరాటం యెడ సానుభూతిని చూపడానికి వస్తూ వుండేవారు శ్రీ డోక్ కూడా అటువంటి వారేనేమోనని అనుకున్నాను. శ్రీ డోక్ లోపలికి వచ్చారు కొద్దినిమిషాలు మాట్లాడాము దురభిప్రాయపడ్డానని తెలుసుకున్నాను లోలోపల వారిని క్షమించమని కోరాను. ఆనాటి నుంచి గాఢ స్నేహితులం అయ్యాము. భారతీయుల జాతీయ సమరాన్ని గురించి పత్రికల్లో వెలువడే విషయాలన్నీ వారికి తెలుసునని గ్రహించాను. మీరు చేస్తున్నది జాతీయ సంగ్రామం నన్ను మీ మిత్రుడిగా భావించండి నేను చేయగలిగిన సేవ ఏమైనా వుంటే చెప్పండి కర్తవ్యంగా భావించి చేస్తాను ఏసుక్రీస్తు బోధనలవల్ల దుఃఖితుల దు:ఖాలలో మనిషి భాగం పంచుకోవాలి అన్న పాఠం నేను నేర్చుకున్నాను " అని వారు చెప్పారు. ఆ విధంగా మా పరిచయం ప్రారంభమైంది మా పరిచయం రోజురోజుకూ పెరిగి, గాఢమైపోయింది

ఇక ముందు యీ పుస్తకంలో శ్రీ డోక్ పేరు పాఠకులకు కనబడుతుంది శ్రీ డోక్ కుటుంబ సభ్యులు నాకు చేసిన సేవను గురించి చెప్పే ముందు వారిని గురించి యీ మాత్రం వ్రాయడం అవసరం అని తోచింది రాత్రిగానీయండి, పగలుకానీయండి శ్రీ డోక్ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నా వెంటవుండవలసిందే నేను వారి యింట్లో వున్నంతకాలం వారి యిల్లు ఒక ధర్మ సత్రమైపోయింది. భారతీయుల్లో కేకలు పెట్టి సామాన్లు అమ్మేవారు. కార్మికులవలె మురికి గుడ్డలు దరించేవారు. వాళ్ల చెప్పులు దుమ్ముకొట్టుకొని వుండేవి. వాళ్లు అమ్మే సామాను మూట వారి దగ్గరే వుండేది. అటువంటి వాళ్లనుంచి అద్యక్షుని వరకు రకరకాల జనంతో వారి యిల్లు కిటకిటలాడుతూ వుండేది నా ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడానికి