పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

191


నన్ను చూడడానికి డాక్టరు అనుమతి పొంది వారంతా వస్తూ వుండేవారు అందరినీ సమానంగా గౌరవించి శ్రీ డోక్ వాళ్లందరినీ హాల్లో కూర్చోబెడుతూ వుండేవారు. నేను వారింట్లో వున్నంత కాలం నా సేవచేయడానికి నన్ను చూడటానికి వచ్చే వందలాది మందిని గౌరవించి పంపడానికి వారి సమయమంతా గడిచిపోతూ వుండేది రాత్రిళ్లు కూడా రెండు మూడు సార్లు శ్రీ డోక్ నా గదిలోనికి వచ్చి మౌనంగా నన్ను చూచి వెళ్లుతూ వుండేవారు వారింట్లో వున్నంత కాలం యిది నా యిల్లేనని అనిపించింది. నాకు గల అత్యంత ప్రియషాత్రులు సైతం శ్రీ డోక్ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా సేపచేయగలిగే వారని నేను ఆనుకోను

నన్ను నాతో బాటు భారతీయ జనాన్ని తన యింట్లో వుంచుకోవడం. సేవ చేయడం. సత్కారం చేయడంవల్ల శ్రీ డోక్‌కు, తమ తెల్లవారి వల్ల యిబ్బందులేమీ కలుగలేదని పాఠకులు భావించకూడదు. తమ బాప్టిస్టు వారికోసం ఒక చర్చిని నడుపుతూ వుండేవారు. ఆ సంప్రధాయుల వల్లనే వారి కుటుంబ పోషణ జరుగుతూ వుండేది వారందరూ ఉదార హృదయులని భావించకూడదు. భారతీయులంటే అయిష్టత వారందరికీ వుండేది కాని శ్రీ డోక్ దాన్ని లెక్క చేయలేదు. మా పరిచయం ప్రారంభంలోనే నేను యీ విషయం వారితో చర్చించాను వారిచ్చిన సమాధానం యిక్కడ వివరించడం అవసరం “నా ప్రియ మిత్రమా! మీరు ఏసుమతాన్ని ఏమని భావిస్తున్నారు? నేను తన ధర్మపాలన కోసం శిలువనెక్కిన మహాపురుషుని అనుచరుణ్ణి వారి ప్రేమ యీ విశ్వమంత విశాలమైనది. తెల్లవారిని గురించి మీకు భయం వున్నది. వారు నన్ను వదిలివేస్తారేమోననే కదా మీ భయం" ఏసుక్రీస్తు ప్రతినిధినని తెల్లవారి ముందు నన్ను నేను భావించుకున్నా, భారతీయులు సాగిస్తున్న పోరాటంలో పాల్గొంటున్నాను అప్పుడు నా మండలి సభ్యులు నన్ను త్యజించినా నేను బాధపడను నా కుటుంబం వారి సాయంతో సడుస్తున్నమాట నిజం అయినా అందుకే వారితో సంబంధం పెట్టుకున్నానని, లేక వారివల్ల నేను బ్రతుకుతున్నానని మీరు భావిస్తున్నారా! నాకు బ్రతుకు