పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

189

శ్రీ చమనీ కాగితాలు తీసుకువచ్చారు. ఎంతో కష్టపడినా పదివ్రేళ్ల ముద్రలు వేసి వారికి యిచ్చాను అప్పుడు వారినేత్రాలనుండి అశ్రుబిందువులు కారుతూ వున్నాయి. వారికి వ్యతిరేకంగా నేను కఠినంగా వ్రాస్తూ వుండేవాణ్ణి కాని యీనాటి ఘట్టం చూచిన తరువాత ఎంతకఠిన హృదయమైనా సమయం వచ్చినప్పుడు ఎంత కోమలం అవుతుందో కండ్లారా చూచాను ఈ పని పూర్తిచేయుటకు కొద్ది నిమిషాలు మాత్రమే పట్టి యుండునని పాఠకులు గ్రహించియే వుండవచ్చు. శ్రీ డోక్, వారి శ్రీమతి యిరువురూ ఎంతో సహృదయులు నేను త్వరగా కోలుకోవాలని వారితపన దాడి జరిగిన తరువాత నా మానసిక స్థితిని చూచి వారు బాధపడ్డారు. దీని చెడు ప్రభావం నా ఆరోగ్యం మీద పడుతుందేమోనని వారి భయం. అందువల్ల నా మంచం దగ్గరికి ఎవ్వరినీ రానీయలేదు. నన్ను ఎమీ వ్రాయనీయ లేదు ఏ పనీ చేయనీయలేదు. నేను వారిని ప్రార్థిస్తూ (లిఖితంగా) నేను శాంతిగా, హాయిగా నిద్రపోవుటకు ముందు మీ కుమార్తె చిరంజీవి ఆలివ్ (అప్పుడు బాలిక) చేత నాకు యిష్టమైన ఇంగ్లీషు కీర్తన "లీడ్ కైండ్లీ లైట్'ను పాడించి వినిపించే ఏర్పాటు చేయండి అని కోరాను శ్రీ డోక్ అనందభరితుడైనారు. సరేనని చెప్పి తమ బిడ్డను పిలిచి, తలుపుల బయట నిలబడి పై పాట మెల్లగా పాడమని చెప్పారు. యీ వివరం వ్రాస్తున్నప్పుడు ఆ దృశ్యం నాకండ్ల ముందు కనబడుతున్నది. ఆలివ్‌ది మధురమైన కంఠం ఆ కంఠస్వరం యీనాటికి నాకు వినబడుతూ వున్నది

ఈ ప్రకరణంలో ఎన్నో విషయాలు వ్రాశాను బహుశ పాఠకులు యింత వ్రాయడం అసంగతమని భావించ వచ్చు. అయినా మరో సంస్మరణను జోడించకుండా యీ ప్రకరణాన్ని ముగించను. ఇప్పుడు జరిగిన ఘట్టాలన్నీ మరిచిపోవుటకు వీలులేని పవిత్రమైన సంస్మరణలే డోక్ కుటుంబంచేసిన సేవల్ని గురించి ఎంత వ్రాసినా తక్కువే

శ్రీ జోసఫ్ డోక్ బాప్టిస్టు సంప్రదాయానికి చెందిన పాదరీ దక్షిణాఫ్రికా రాకముందు వారు న్యూజిలెండులో వుండేవారు. పరాన్లు నా మీద