పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

181


చట్టాన్ని అంగీకరించిన వారిని ఎవ్వరూ ద్వేషించలేదు. కాని వారి చర్యను ఖండించడం, ఇండియన్ ఒపీనియన్ పత్రికలో వ్రాయడం జరిగింది. దాని వల్ల చట్టాన్ని అంగీకరించిన వారికి యిబ్బందులు కలిగిన మాట వాస్తవం ఎక్కువమంది భారతీయులు పట్టుమీద నిలబడియుండగలరని అట్టివారు భావించలేదు. చివరికి యీ విషయమై ప్రభుత్వంలో ఒప్పందం జరుగుతుందని కూడా వాళ్లు అనుకోలేదు. 160 మంది కంటే ఎక్కువమంది సత్యాగ్రహులు జైళ్లకు వెళ్లారు. ప్రభుత్వానికి, జాతినాయకులకు మధ్య సంభాషణలు మొదలయ్యాయి. ఆ చట్టానికి లొంగి వ్యవహరించిన వారికి యిదంతా సచ్చలేదు. యీవిధంగా ఒప్పందానికి రావడం వాళ్లకు యిష్టం లేదు. ఒక వేళ ఒప్పందం కుదిరినా దాన్ని చెడగొట్టి తీరాలనే నిర్ణయానికి వాళ్లు వచ్చారు

ట్రాన్స్‌వాల్‌లో వుండే పరాన్ల సంఖ్య తక్కువే 50 మంది కంటే మించి యుండరు. కొందరు బోయరు యుద్ధంలో సైనికులుగా చేరి పనిచేశారు యుద్ధ సమయంలో అక్కడికి వచ్చిన అనేక మంది తెల్లవారి వలెనే, సైనికులుగా వచ్చిన కొందరు పరాన్లు తదితర భారతీయులు యుద్ధం తరువాత అక్కడే వుండిపోయారు. వారిలో కొందరు పరాన్లు నాకు వకాల్తా కూడా యిచ్చారు. అందువల్ల వారితో నాకు మంచి సంబంధం ఏర్పడింది. పరాన్లు స్వతస్సిద్ధంగా అమాయకులు పరాక్రమవంతులు చంపడం, చావడం అంటే వాళ్లకు మంచి నీళ్ల ప్రాయం ఎవరి మీదనైనా వారికి కోపం వస్తే వాళ్లను బాదుతారు. వాళ్ల బాషలో వారి వీపును వేడిచేస్తారన్న మాట అప్పుడప్పుడు ప్రాణాలు కూడా తీసివేస్తారు. యిలాంటి విషయాల్లో నిష్పక్షపాతంగా వుంటారు. సొంత అన్నదమ్ముల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారు. ట్రాన్స్‌వాల్‌లో వున్న పఠానులు సంఖ్యలో తక్కువగా వున్నా వారిలో వారికి కొట్లాటలు జరుగుతూ వుండేవి యిలాంటప్పుడు రెండు వర్గాల మధ్య శాంతిని నెలకొల్పవలసి వస్తూ వుండేది. ఒక పరాను మరో పరానుకు నమ్మకద్రోహం చేస్తే యిక వారిని పట్టడం కష్టం అప్పుడు కొట్టుకు చావడమే వారికి తెలిసిన ఏకైక చట్టం