పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ఒడంబడికకు వ్యతిరేకత


సత్యాగ్రహ పోరాటంలో పరాన్లు బాగా పాల్గొనేవారు. వారిలో ఒక్కరు కూడా రక్తపు చట్టానికి లొంగలేదు వాళ్లను మభ్యపెట్టడం తేలిక పదివ్రేళ్ల ముద్రల విషయంలో వాళ్లను కావాలని కొందరూ రెచ్చ గొట్టారు. నేను లంచం తిననప్పుడు పదివ్రేళ్ల ముద్రల విషయం ఎందుకు ఎత్తినట్లు? కనుక యీవిధంగా పరాన్ల హృదయంలో సందేహం కలిగించగలిగారన్న మాట

మరో వర్గం కూడా ట్రాన్స్‌వాల్‌లో వున్నది. అసలు అనుమతి పత్రాలు లేకుండా రహస్యంగా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించిన భారతీయులు కొందరున్నారు వాళ్లు తమ మాదిరిగానే యితరుల్ని కూడా రహస్యంగా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించుటకు, దొంగపత్రాల ద్వారా ప్రవేశ పెట్టుటకు సహకరిస్తారన్నమాట ప్రభుత్వంతో రాజీ పడటం వాళ్లకు యిష్టం లేదు రాజీ పడితే వాళ్ల ఆదాయం పడిపోతుంది కదా పత్రాలకు వ్యతిరేకంగా సమరం సాగినంతకాలం వాళ్లకు చేతినిండాపనే అప్పుడు ఎవ్వరికీ పత్రం చూపించనవసరం లేదు. నిర్భయంగా తమ తప్పుడు వ్యాపారం వాళ్లు చేసుకొనే వాళ్లు సత్యాగ్రహసమరం జరుగుతున్నది కనుక జైలుకు పోకుండా తప్పించుకునేవాళ్లు సత్యాగ్రహసమరం ఎంత కాలం సాగితే వాళ్లకు అంతమంచిది యీ రకం మనుష్యులు కూడా పరాన్లను రెచ్చగొట్టారన్నమాట ఇక పరాన్లు అకస్మాత్తుగా ఎందుకు రెచ్చిపోయారో పారకులు తేలికగా ఊహించుకోవచ్చు

అర్ధరాత్రి జరిగిన మీటింగులో పరాన్ల ప్రశ్నల ప్రభావం ఎవ్వరి మీదా పడలేదు. ఒడంబడికను గురించి అభిప్రాయం తెలుపమని జనాన్ని కోరాను అధ్యక్షుడు, తదితరులు గట్టిగా వున్నారు. పరానుతో నా సంభాషణ ముగిసిన తరువాత అధ్యక్షుడు ఒడంబడిక యందలి షరతులను గురించి, వాటిని అంగీకరించవలసిన అవసరాన్ని గురించి ఉపన్యసించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ముగ్గురు నలుగురు పరాన్లు మినహా మిగతా వారంతా ఒడంబడికకు అనుకూలంగా చేతులు ఎత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు ఆ రాత్రి రెండు లేక మూడు గంటలకు యింటికి చేరాను నిద్రపోయేందుకు సమయం చిక్కలేదు. ప్రొద్దున్నే వెళ్లి జైల్లో వున్న వారిని విడిపించవలసి