పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

183


యున్నందున, ఉదయం 7 గంటలకు అక్కడికి వెళ్లాను. అప్పటికే జైలు సూపరింటెంటుకు ఫోనుద్వారా ఆర్డరు అందింది. ఆయన నా కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక గంట లోపున సత్యాగ్రహ ఖైదీలందరూ విడుదల అయ్యారు. అధ్యక్షుడు, మిగతా భారతీయులు కూడా వారికి స్వాగతం చెప్పుటకు అక్కడికి వచ్చారు. జైలునుంచి కాలినడకన మేమంతా సభాస్థలి దగ్గరికి వెళ్లాము అక్కడ మళ్లీ సభ జరిగింది. ఆరోజు, యింకా మూడు నాలుగు రోజులు భోజనాలతోను సమావేశాల తోను గడిచిపోయాయి

రోజులు గడిచే కొద్దీ షరతుల వివరం స్పష్టం కావడంతోబాటు, వ్యతిరేకత కూడా పెరుగుతూనే వున్నది. జనంలో ఉత్తేజం ఎందుకు కలిగిందో పైన వివరించాను యింతేగాక జాతి తరఫున జనరల్ స్మట్సుకు వ్రాసి ప్రకటించిన జాబు కూడా అపోహలకు ఆజ్యం పోసింది. వీటన్నింటి వల్ల సత్యాగ్రహ పోరాటం జరిగినప్పుడు నాకు కలిగిన కష్టాల కంటే యీ సారి కష్టాలు ఎక్కువై పోయాయి పోరాటం సమయంలో మిత్రులని, శతృవులని కొందరిని భావిస్తూ వుంటాము వాళ్లతో వ్యవహరించే మనతీరులో యిబ్బందులు కలుగుతూ వుంటాయి. ఇటువంటి కష్టాల్ని త్వరగా తొలగించుకోవచ్చని అనుభవం వల్ల తెలుసుకున్నాను పోరాటం సమయంలో ఆపనమ్మకాలు, కలహాలు మొదలగునవి వుండవు వున్నా బహుతక్కువగా వుంటాయి కాని పోరాటం తరువాత పరస్పరం వుండే ఈర్ష్యా ద్వేషాలు, అపనమ్మకాలు, కలహాలు అణిగివున్నవన్నీ ఒక్కసారిగా బయట పడతాయి. అప్పుడు ఒడంబడిక ఏమైనా జరిగితే అందు దోషాలు వెతుకుటకు జనం సిద్ధంగా వుంటారు ప్రజాస్వామ్య విధానంలో అడిగేవాడి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పక తప్పదు. వాళ్లకు తృప్తి కలిగించవలసి వస్తుంది. యీ పద్ధతే మంచిది యిటువంటి సమయంలో మిత్రులతోపాటు వుండి మనిషి పొందగలిగినంత అనుభవం ప్రతిపక్షాల వారితో చేసే పోరాటంలో పొందలేడు. ప్రతిపక్షాలవారితో జరిపే పోరాటంలో నిషా వుంటుంది. మనిషికి ఉత్సాహం కలుగుతుంది కాని మిత్రుల్లో ఏర్పడే అపోహలకు, అపనమ్మకాలకు సమాధానం చెప్పునప్పుడు