పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ఒడంబడికకు వ్యతిరేకత


మంచితనంగా భావించబడుతుంది. యీ కారణం వల్లనే నేను పదివ్రేళ్ల ముద్రవేయమని జాతికి సలహా యిస్తున్నాను"

“మీరు జాతిని మోసగించారని, జనరల్ స్మట్సు దగ్గర 15000 పౌండ్లు తీసుకొని జాతిని జనరల్ స్మట్సుకు అమ్మి వేశారని వింటున్నాము మేము పదివ్రేళ్ల ముద్రవేయం యింకొకరిని వేయనీయం దేవుడి ఒట్టు, ఏషియాటిక్ ఆఫీసులో అందరికంటే ముందు అడుగుపెట్టిన వాడి ప్రాణాలు తోడేస్తాను "

పరాన్ మిత్రుల భావాల్ని అర్థం చేసుకున్నాను లంచం తిని నేను నా జాతిని అమ్మివేస్తానని ఎవ్వరూ నమ్మరని విశ్వసిస్తున్నాను వేలిముద్రలు వేయడం యిష్టం లేని వాళ్లు వేయవద్దని ముందే చెప్పాను. అట్టివారిని ఎవ్వరూ బలవంతం చేయరు వేలి ముద్రలు వేయకుండా పత్రాలు కావాలని అనుకుంటే, అట్టి వారు పత్రాలు తీసుకోవచ్చునని సభా ముఖంగా ప్రకటిస్తున్నాను కాని ప్రాణాలు తోడేస్తానని అన్న మాటను నేను అంగీకరించను దేవుని మీద ఒట్టు పెట్టి మరొకరిని చంపి వేస్తానని బెదిరించడం శుద్ధ తప్పు యీ మిత్రుడు క్షణిక ఆవేశంతో దేవుని మీద ఒట్టు పెట్టి యిటువంటి మాట అన్నాడని భావిస్తున్నాను యీ మిత్రుడు తన ఒట్టును అమలు బరిచినా, అమలు బరచక పోయినా, యీ ఒడంబడికకు అంగీకరించిన నేను అందరికంటే ముందు వేలిముద్రలు వేసి పత్రం తీసుకుంటానని ప్రకటిస్తున్నాను యిది నా కర్తవ్యమని భావిస్తున్నాను నన్నే మొట్టమొదట యీ పని చేయనీయమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎవరైనా ఏదో ఒక రోజున చావవలసిందే కదా! రోగంతోగాని, మరింకే కారణం వల్లనైనాగాని చనిపోకుండా నా ఒక సోదరుని చేతిలో చనిపోవడం వల్ల నాకు దు:ఖం కలుగదు. ఆ సమయంలో సైతం కోపం రాకుండా, అతని ఎడ శతృభావం లేకుండా వుంటే నా భవిష్యత్తు ఉజ్వలం అవుతుందని నమ్ముతున్నాను నేను పూర్తిగా నిర్దోషినని' నన్ను చంపిన వాడు తరువాతనైనా తప్పక తెలుసుకుంటాడు" అని చెప్పాను

పరాను పై విధంగా ప్రశ్నించడానికి కారణం ఏమిటో పాఠకులు తెలుసుకోవాలి రక్తపు చట్టాన్ని భారతీయుల్లో కొందరు అంగీకరించారు. ఆ