పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

179


అదేవిధంగా యిప్పుడు పత్రాలు తీసుకోమని ప్రచారం చేయాలి మనం మనకర్తవ్యాన్ని నెరవేరుద్దాం జయం తప్పక లభిస్తుంది "

నా ప్రసంగాన్ని పూర్తి చేయగానే ఒక పరాస్ మిత్రుడు (మీర్ ఆలం} లేచి నిలబడి నా మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఒడంబడిక ప్రకారం మనం పదివ్రేళ్ల ముద్రలు వేయడం అవసరమవుతుందా? అని సూటిగా ప్రశ్నించాడు

వున్నది అని లేదు అనీ చెప్పవచ్చు. పదివ్రేళ్ల నిశానీ వేద్దామనే నా సలహా మతరీత్యా యిది తప్పని భావించినా, అవమానకరమని భావించినా అట్టివారు వేయనవసరం లేదు. మానుకోవచ్చు" అని చెప్పాను

“మీరు స్వయంగా ఏం చేస్తారు?" పది వ్రేళ్లతో ముద్రవేయడానికి నిర్ణయించుకున్నాను నేను ముద్రవేయకుండా యితరుల్ని ముద్ర వేయమని చెప్పలేను" అని అన్నాను

మీరు పదివ్రేళ్ల ముద్రల్ని గురించి గతంలో తెగ వ్రాశారు. యిది అపరాధులు చేయవలసిన పని అని మీరే నేర్పారు. మన జాతి పోరాటం పదివ్రేళ్ల నిషానీతోనే అని కూడా మీరే చెప్పారు. అదంతా యివాళ ఏమైంది?"

"పదివ్రేళ్ల ముద్రల్ని గురించి గతంలో వ్రాసిన వ్రాతల మీద యీనాడూ నేను నిలుస్తున్నాను. భారత దేశంలో యీ విధంగా అపరాధం చేసినవారిచేతనే ముద్రలు వేయిస్తూ వుంటారని చెప్పాను రక్తపు చట్టానికి అనుకూలంగా పదివ్రేళ్ల ముద్రలే కాదు, సంతకం చేయడం కూడా తప్పేనని యిప్పుడూ చెబుతున్నాను. ఆ విషయాన్ని మన జాతి గుర్తించింది కాని యిప్పుడు పరిస్థితి మారింది. నిన్నటి వరకు తప్పని అనిపించిన విషయం యిప్పుడు సజ్జనత్వానికి గుర్తు అని తేలింది. మీరు నాకు సలాం చేసి, అందుకు బదులుగా సలాంచేయమని మీరు నన్ను వత్తిడి చేస్తే, నేను మీకు సలాం చేయడం సరికాదు. అది భగవంతుని దృష్టిలో, నా దృష్టిలో సరి కాదు మిమ్మల్ని సోదరుడుగా భావించి, మనిషిగా గుర్తించి స్వేచ్ఛతో సలాంచేస్తే దానివల్ల నా గొప్పతనం వెల్లడి అవుతుంది. దేవునిదర్బారులో అది