పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ఒడంబడికకు వ్యతిరేకత


జరుగుతుందనే భావంతో అంగీకరిస్తాడు. యీ నాటి మనస్థితి యిదే ఎంత నమ్మకద్రోహం చేసినా ప్రభుత్వం యీ స్థితిని మార్చలేదు. స్థితిని కల్పించేది మనం మార్చేదీమనమే మన చేతుల్లో సత్యాగ్రహ ఆయుధం వున్నంత వరకు మనం నిశ్చింతగాను నిర్భయంగాను వుండవచ్చు.

ఇప్పుడు మన జాతికి లభించిన బలం యిక ముందు లభించదు అని ఎవరైనా అంటే అతడికి సత్యాగ్రహాశక్తి ఏమిటో తెలియదని అనుకోవాలి యీనాటి జాతి బలం కృత్రిమమైనది అది నిలిచేది కాదు క్షణికం అనే గదా దాని అర్థం యిదే నిజమైతే జయం పొందే అధికారం మనకు లేనట్లే ఒక వేళ గెలిచినా ఆ జయాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేము ప్రభుత్వం రక్తపు చట్టాన్ని రద్దు చేసిన తరువాత మనం పత్రాలు తీసుకున్నాం అని అనుకుందాం. తీరా పత్రాలు తీసుకున్న తరువాత ప్రభుత్వం మళ్లీ రక్తపు చట్టాన్ని అమలు చేస్తే ఎవరు ఆపగలరు? మన శక్తి మీద మనకు నమ్మకంలేకపోతే రేపైనా అంతేగదా! అందువల్ల యీ ఒడంబడిక వల్ల మన జాతికి నష్టం లేదు. లాభమే కలుగుతుంది. మనం న్యాయంగాను, వినమ్రంగాను వ్యవహరిస్తే మన శతృవులు కూడా తగ్గుతారు. తగ్గక తప్పదు "

ఇంత చెప్పినప్పటికీ ఒకరిద్దరిని ఒప్పించలేక పోయాను అర్థరాత్రి సభలో పెద్ద ప్రమాదం ముంచుకురానున్నదని నేను గ్రహించ లేకపోయాను ఒడంబడికను గురించి, అందలి షరతులను గురించి చెప్పి యిలా అన్నాను “మనజాతి బాధ్యత యివుడు బాగా పెరిగింది. మనం రహస్యంగా ఒక్క భారతీయుణ్ణి కూడా ట్రాన్స్‌వాల్‌లోకి రానివ్వం అని తెలుపుటకు, అందరం అనుమతి పత్రాలు తీసుకుందాం ఎవరైనా తీసుకోకపోతే వారికి ఏ విధమైన శిక్షపడదు. పత్రాలు తీసుకోకపోతే మన జాతి ఒడంబడికను అంగీకరించడం లేదని తేలుతుంది. అందువల్ల మీరు మీ చేతులెత్తి యీ ఒడంబడికకు అనుకూలాన్ని తెలుపండి. చేతులెత్తిన వారంతా పత్రాలు యివ్వడం ప్రారంభించగానే వెళ్లి తీసుకోవాలని కోరుతున్నాను యిప్పటి వరకు మీలో చాలా మంది వాలంటీర్లుగా వుండి పత్రాలు తీసుకోవద్దని ప్రచారం చేశారు