పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

177


విషయంలో యిచ్చి పుచ్చుకోవడం అనేది ఒకటి వుంటుంది. రక్తపు చట్టం ముందు తలవంచి ఆ ప్రకారం మనం నడుచుకోము సిద్ధాంతాన్ని పాటించి తీరాలి రెండో వైపున ప్రభుత్వం కోరుతున్నదేమిటో యోచిద్దాం ట్రాన్స్‌వాల్‌లో భారతీయులు చట్ట విరుద్ధంగా ప్రవేశిస్తున్నారు. దాన్ని అరికట్టుటకు స్వేచ్ఛగా భారతీయులు ప్రవేశ పత్రాల్ని తీసుకుంటే పని తేలిక అవుతుంది యిందువల్ల తెల్ల వాళ్ల అనుమానం తీరుతుంది. ప్రభుత్వం తన యీ కోరికను విడనాడదు ఆచరణలో యీ ప్రభుత్వ కోరికను మనం అంగీకరిద్దాం అందుకు బలవత్తరమైన మరో కారణం ఏమీ దొరకనంత వరకు మనం దాన్ని ఉల్లంఘించలేము రక్తపు చట్టం మనకు కళంకం వంటిది. దాన్ని తుడిచి వేయుటకు యీ పద్ధతిని సత్యాగ్రహులంగా అంగీకరిద్దాం"

మరో విషయం రక్తపుచట్టం రద్దు కానంతవరకు మన చేతుల్ని మనమే ఎందుకు నరుక్కోవడం? మన ఆయుధాన్ని ఎందుకు వదలుకోవడం? దీనికి సమాధానం ఒక్కటే సత్యాగ్రహి భయాన్ని వదిలి వేయాలి 20 సార్లు శతృవు నమ్మక ద్రోహం చేసినప్పటికీ 21 వసారి శతృవును సత్యాగ్రహి విశ్వసిస్తాడు విశ్వాసమనేదే సత్యాగ్రహి ఆయుధం శతృవును సైతం విశ్వసించడమంటే మన చేతుల్ని ననరుక్కోవడమేనని భావించడం సరికాదు. మరో విషయం మనం స్వేచ్చగా పత్రాలు తీసుకుంటాం అయినా ప్రభుత్వం రక్తపు చట్టాన్ని రద్దు చేయదు. అప్పుడు మనం వూరుకుంటామా? సత్యాగ్రహం చేయమా? పత్రాలు తీసుకున్న తరువాత కూడా అవసరమైనప్పుడు వాటిని మనం చూపించక పోతే ప్రభుత్వం కోరిక నెరవేరదు కదా మనం యిలా చేస్తే ప్రభుత్వం రహస్యంగాలోనికి దూరుతున్న భారతీయుల్ని గుర్తించలేదు. అందువల్ల చట్టం వున్నాలేకపోయినా మన సహకారం లేనిదే ప్రభుత్వం పని సాగదు చట్టం ప్రకారం నడుచుకోకపోతే ప్రభుత్వం శిక్షిస్తుంది. శిక్ష అనుభవించుటకు మనం సిద్ధపడతాం. సామాన్యంగా మనిషి శిక్షపడుతుందనే భయంతో చట్టానికిలోబడి నడుచుకుంటాడు. అయితే సత్యాగ్రహి యిందుకు భిన్నంగా నడుచుకుంటాడు. అంకుశాన్ని చట్టభయంవల్లకాక, లోకానికి మేలు