పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

165


త్యాగధని శ్రీతంబినాయుడు అవసరానికి మించిన సాహసి, సహజంగా ముక్కోపి కాకుండా వుంటే, అటువంటి వీర పురుషుడు ట్రాన్స్‌వాల్‌లో కాఛలియా స్థానాన్ని అలంకరించి జాతికి నేతృత్వం వహించియుండేవారు. ట్రాన్స్‌వాల్‌లో సత్యాగ్రహసమరం ప్రారంభమైనంతవరకు ఆయన ముక్కోపం బయటపడలేదు. ఆయన యందలి సుగుణాలు రత్నాలవలె ప్రకాశించాయి కాని ఆ తరువాత ఆయనకోపం, ఆయన సాహసం రెండూ ఆయనకు ప్రబల శతృవులుగా మారాయని విన్నాను. ఆ రెండు దుర్గుణాలు వారి సద్గుణాలనన్నింటిని కప్పి వేశాయి. ఏదిఏమైనా దక్షిణాఫ్రికా సత్యాగ్రహ సంగ్రామ చరిత్రలో తంబినాయుడు పేరు ప్రధమ శ్రేణిలో వుండతగినది. మేమందరం కోర్టులో ఒకేసారి హాజరు కావాలి కాని అందరి కేసులు విడివిడిగా నడిచాయి. మేజస్ట్రేటు కొంతమందిని 48 గంటలలోపున, కొంతమందిని 7 లేక 14 రోజుల్లోపున ట్రాన్స్‌వాల్ వదిలివెళ్లమని ఆదేశించాడు. ది 10 జనవరి 1908 నాటికి ఆ గడువు పూర్తి అవుతుంది. ఆ రోజున విధించబడిన శిక్షను వినడం కోసం మేము కోర్టుకు తిరిగి రావాలని అర్దరు వేశాడు మేము మా రక్షణ కోసం వాదించవలసిందేమీ లేదు. గడువుదాటేలోపున ట్రాన్స్‌వదిలి వెళ్లేది లేదు. సవినయంగా మేజిస్ట్రేటు ఆర్డరును ధిక్కరించి, ఆ ఆపరాధాన్ని అంగీకరించడానికి అంతాసిద్ధంగా వున్నాము

కోర్టులో చిన్న ప్రకటన చేయుటకు నేను అనుమతి కోరాను. అందుకు అనుమతి లభించింది. "నా కేసుకు, నాతరువాత వచ్చేవారి మీద మోపబడిన కేసులకు వ్యత్యాసం చూడటం అవసరం. ప్రిటోరియానుంచి యిప్పుడే నాకు సమాచారం అందింది నా దేశబంధువులకు అక్కడ మూడు మాసాలకైదుశిక్ష, మరియు పెద్ద జుర్మానా విధించబడ్డాయి. జుర్మానా చెల్లించకపోతే యింకో మూడు మాసాల శిక్ష విధించారు. వారంతా అపరాధంచేసియుంటే, వారందరి కంటే నేను పెద్ద అపరాధిని గనుక నాకు కఠినాతికఠిన శిక్ష విధించచుని మేజస్ట్రేటు గారిని ప్రార్థిస్తున్నాను" అని ప్రకటించాను. కాని మేజస్ట్రేట్ నా ప్రకటనను పట్టించుకోలేదు. నాకు రెండు మాసాల సామాన్య ఖైదు శిక్ష