పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

నిర్బంధాల వెల్లువ


దోషాలువుండేవి అనుభవం ద్వారానే వారు తమిళం నేర్చుకున్నారు హిందుస్తానీ భాషకూడా మాట్లాడగలరు తెలుగు కూడా వారికి వచ్చు హిందీ, తెలుగు లిపులు వారికి రావు కాని ఆ రెండు భాషలు వారికి వచ్చు మారిషస్ భాషయగు క్రియోల్ కూడా వారికి బాగా వచ్చు. క్రియోల్ భాష ఫ్రెంచి బాపయొక్క ఆపభ్రంశరూపం దక్షిణ భారత దేశానికి చెందిన వారికి సామాన్యంగా యిన్ని భాషలు తెలుసునని చెబితే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దక్షిణాఫ్రికాలో వున్న వందలాది భారతీయులకు యీ భాషలన్నిటి సామాన్యపరిచయం వున్నది. వాళ్లు తేలికగా యిన్ని భాషలు మాట్లాడుతారు. నా దృష్టిలో యిందుకు ఒక కారణం వున్నది. విదేశీ భాషా మాధ్యమం ద్వారా విద్య గడించి వారి బుర్రలు అలిసిపోవు. వారిజ్ఞాపకశక్తి చురుగ్గా వుంటుంది యీ భాషలు మాట్లాడే వారితో ప్రత్యక్షంగా మాట్లాడి ఆయా భాషల తీరు తెన్నుల్ని పరిశీలించి ఆ భాషా జ్ఞానం వారు పొందుతూ వుంటారు. మస్కిష్కానికి యిది చిన్ని వ్యాయామం దీని వల్ల వారి మస్కిష్కం అలసిపోదు. వికాసం పొందుతుంది. తంబినాయుడి విషయం కూడా యింతే ఆయనకు బుద్ధి తీవ్రత అధికం క్రొత్త ప్రశ్నల్ని తేలికగా అర్థం చేసుకుంటారు తక్కువగా జవాభిచ్చేవారి పద్ధతిని చూచి అంతా ఆశ్చర్య పడుతూ వుంటారు ఆయన భారత దేశాన్ని ఎన్నడూ చూడలేదు. కాని భారత దేశమంటే ఆయనకు అపారమైన ప్రేమ స్వదేశాభిమానం ఆయన రోమరోమంలో హత్తుకుపోయింది. వారి యందలి స్థిరత్వం వారిముఖంలో ప్రతిబింబిస్తూ వుంటుంది. వారి శరీరం బలిష్టంగా వుంటుంది. మంచి ఒడ్డుపొడవుగల మనిషి కాయకష్టం చేస్తున్నప్పుడు అలిసి పోయేవారు కాదు. ఏ సభలోనైనా కుర్చీమీద కూర్చొని అధ్యక్ష పదవినలంకరించవలసి వచ్చినా లేక అవసరమైనప్పుడు హమాలీ పని చేయవలసి వచ్చినా చేస్తూ వుండేవారు నడిరోడ్డున మూటలు మోయవలసి వచ్చినా తంబినాయుడు సిగ్గుపడేవాడు కాదు. కష్టపడవలసివస్తే రాత్రి, పగలు అనే తేడాను గమనించేవాడు కాదు భారత జాతి కోసం సర్వమూ అర్పణ చేసే విషయంలో ఎవ్వరికీ తీసిపోని