పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

నిర్బంధాల వెల్లువ


విధించాడు. ఏకోర్టులో నేను వకీలుగా వందలాది సార్లు నిలబడ్డానో, వకీళ్ల మండలి సభ్యులతో కలిసి మెలిసి తిరిగానో అదే కోర్టులో యివాళ నేను ముద్దాయి. రూపంతో బోనులో నిలబడ్డాను. యీ స్థితి నాకు విచిత్రంగా తోచింది. అయితే వకీళ్లతోబాటు వున్నప్పుడు ఎంతటి గౌరవప్రతిష్ఠల్ని నేను హృదయంలో పొందానో, అంతటి గౌరవ ప్రతిష్ఠల్ని ముద్దాయిగా బోనులో నిలబడ్డ యిప్పుడు కూడా పొందానని చెప్పగలను సంకోచమేమీ నాకు కలుగలేదు. కోర్టులో వందలాది భారతీయ సోదరులు. వకీళ్లు. మిత్రులు మొదలైన వారి ఎదుట నిలబడి యున్నాను శిక్ష విధించ బడిన తరువాత ఒక రక్షక భటుడు ముందుకు వచ్చి జైలుకు తరలించే ముందు కైదీలను వుంచే చోటుకి నన్ను తీసుకువెళ్ళాడు

అక్కడ నిశ్శబ్దంగా వున్నది. కైదీలు కూర్చునేందుకై ఒక బెంచివున్నది ఆ బెంచీ మీద కూర్చోమని చెప్పి ఆ రక్షక భటుడు బయట తలుపు బిగించి వెళ్లిపోయాడు యిక్కడ నాకు కొంచెం గాబరాకలిగింది. నేను ఆలోచనల్లో మునిగిపోయాను. నా యిల్లు వాకిలి ఎక్కడ నా బారిష్టరీ ఎక్కడ, ఆ ప్రజాసభలు ఎక్కడ? అన్ని స్వప్నాల్లా తెరమరుగైనాయి యిప్పుడు నేను కైదీగా యిక్కడకూర్చున్నాను. రెండు మాసాల్లో ఏమవుతుందో? రెండు మాసాలపూర్తి కైదు శిక్ష నేను అనుభవించవలసి వస్తుందా? జాతి ప్రజలంతా అనుకున్న ప్రకారం పెద్ద సంఖ్యలో జైళ్లకు వెళ్లితే రెండు మాసాల పాటు శిక్ష అనుభవించనవసరం వుండదు. కాని వారంతా ఆలా జైళ్లకు వెళ్లడానికి సాహసించకపోతే రెండు మాసాలు జైళ్లో వుండక తప్పదు. రెండు మాసాలంటే ఎక్కువ సమయమే యీ విధంగా కలిగిన భావాలను వ్రాయడానికి యిప్పుడు పట్టినంత సమయంలో వందో శాతం సమయం కూడా ఆ భావాలు కలగడానికి పట్టలేదు. యిటువంటి భావాలు మనస్సులో మసలినందుకు సిగ్గుపడిపోయాను నేను ఎంత మిధ్యాభిమానిని జైలును పెద్దమహలుగా భావించమని జాతి ప్రజలకు చెప్పాను రక్తపు చట్టాన్ని వ్యతిరేకించే సమయంలో ఎన్ని దుఃఖాలు కలిగినా వాటిని సుఖాలుగా భావించాలని