పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

163


వేస్తామో, ఆ భూమిని చైనా వాళ్లు పరీక్షించి అక్కడి మట్టి యందలి వివిధ ఎశేషాల్ని గ్రహించి ఆ మట్టికి సరిపోయే విత్తనాలుచల్లి ఆందుపంటలు పండిస్తారు

కష్టపడి పని చేసే తెలివిగల చైనా ప్రజలకు కూడా రక్తపు చట్టం వర్తింపచేశారు. అందువల్ల భారతీయులు ప్రారంభించిన సంగ్రామంలో చైనావారు కూడా చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే యిరుదేశాల వారు అనుసరించిన విధానాలు మాత్రం విడివిడిగా పున్నాయి. తమతమ సంస్థల ద్వారా రెండు జాతులవారు. తెల్ల ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్నారు ఆవిధంగా పోరాడినంత కాలం రెండు జాతులవారు లాభం పొందారు యింతలో ఒక జాతి పడిపోయింది రెండో జాతి పడిపోలేదు. ఆ పోరాటంలో చాలా మంది చైనా వారు ఓడిపోయారు వారి నాయకుడు వారిని మోసగించాడు. చైనా నాయకుడు. రక్తపు చట్టానికి లొంగిపోలేదు. కాని ఆ సంస్థకు సంబంధించిన డబ్బు, లెక్కల పుస్తకాలు అన్నీ తీసుకొని పారిపోయాడని నాకు మిత్రులు చెప్పారు. నాయకుడు లేకపోతే జనం చెల్లాచెదురైపోవడం సహజమే కదా నాయకుడిలో మలినం కనబడితే, అనుచరులు నిరాశపడిపోతారు. అరెస్టులు జరిగినప్పుడు చైనీయులు అమితోత్సాహంగా వున్నారు. వారిలో ఎవ్వరూ అనుమతి పత్రాలు తీసుకోలేదు భారతీయులతో బాటు వారి నాయకుల్ని అరెస్టు చేసినట్లే చైనావారిని, క్విన్‌తో లో సహా వారి నాయకుల్ని అరెస్టు చేశారు. కొంతకాలం శ్రీక్విన్ చక్కగా పనిచేశాడని చెప్పవచ్చు

అరెస్టు చేయబడిన భారతీయ నాయకుల్ని పరిచయం చేస్తాను శ్రీ తంభినాయుడు తమిళభాషీయుడు. ఆయన మారిషస్‌లో జన్మించాడు ఆయన తల్లి తండ్రి పొట్టపోసుకోవడం కోసం మద్రాసు నుంచి మారిషస్ వెళ్లారు. తంబినాయుడు సామాన్య వ్యాపారస్తుడు ఆయనకు పాఠశాల విద్య అబ్బలేదు. కాని అనుభవజ్ఞానం అధికంగా లభించింది. ఇంగ్లీషు బాగా మాట్లాడగలరు వ్రాయగలరు. భాషాశాస్త్ర దృష్ట్యా వారి ఇంగ్లీషులో