పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

నిర్బంధాల వెల్లువ


నిర్బంధంలోకి తీసుకోవడం అవసరమనీ, లేకపోతే జాతిబలం పెరుగుతుందేగాని తరగదని భావించారు. తత్ఫలితంగా 1907 డిసెంబరు మాసంలో కొంతమంది నాయకులకు కోర్టులో హాజరుకమ్మని నోటీసు పంపారు. నోటీసు యిచ్చే విషయంలో అధికారులు సభ్యతగా వ్యవహరించారని చెప్పవచ్చు.

వాళ్లు అనుకుంటే వారంట్లు జారీ చేసి నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకోవచ్చు కాని అలా చేయకుండా హాజరుకమ్మని వాళ్లకు నోటీసు యిచ్చి అధికారులు సభ్యతతోబాటు, జాతి నాయకులు అరెస్టు కావడానికి సిద్ధంగా వున్నారనే సత్యాన్ని కూడా ప్రకటించారు. హాజరు కావలసిన రోజు శనివారం ది 28-12-1907 ఆనాడు కోర్టులో హాజరైన నాయకులు "చట్ట ప్రకారం మీరు అనుమతి పత్రాలు తీసుకోవాలి కాని మీరు తీసుకోలేదు. కనుక ఫలానా సమయంలోపున ట్రాన్స్‌వాల్ సరిహద్దుల్ని దాటి వెళ్లిపొండని మీకు అర్డరు ఎందుకు యివ్వకూడదో తెలుపండి" అని యిచ్చిన నోటీసుకు సమాధానం యివ్వాలి. ఇట్టి నాయకుల్లో ఒక సజ్జనుడి పేరు క్వీస్ అతడు జోహన్స్‌బర్గ్‌లో నివసిస్తున్న చైనీయులకు నాయకుడు జోహన్స్‌బర్గ్‌లో 300 . 400 మంది చైనావారు వుంటున్నారు. వారంతా వ్యాపారాలు వ్యవసాయం చేస్తువుంటారు భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అయితే వ్యవసాయాన్ని చైనా ప్రజలు అభివృద్ధి చేసినంతగా భారతీయులు చేయలేదని చెప్పక తప్పదు. అమెరికా మొదలుగాగల దేశాల్లో ఆధునిక యుగంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి అమోఘం అయితే పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న వ్యవసాయం ప్రయోగస్థాయిలో వున్నదని భావిస్తున్నాను చైనా మన భారతావని వలెనే ప్రాచీన దేశం ప్రాచీన కాలాన్నుంచి అక్కడ వ్యవసాయ కార్యక్రమం జరుగుతున్నది. అందువల్ల చైనాను భారతదేశాన్ని రెండిటినీ యీ విషయంలో పోల్చి చూచుకొని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. జోహన్స్ బర్గ్‌లో నివసిస్తున్న చైనీయులు చేస్తున్న వ్యవసాయం చూచి, వారి వ్యవసాయానికి సంబంధించిన విశేషాలు విని వాళ్ల జ్ఞానం, కృషి మనకంటే గొప్పదని నాకు అనిపించింది పంటకు పనికి రాదు అని భావించి మనం ఏ భూమిని వదిలి