పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

161


ప్రచురణ ప్రారంభించాము పుస్తక ప్రచురణకు లక్ష్యం డబ్బు సంపాదనకాదు సత్యాగ్రహ సంగ్రామానికి ఉపయోగపడే విధంగా పుస్తకాలు ప్రచురించినందున వాటి అమ్మకంకూడా పెరిగింది. ఈ విధంగా ఇండియన్ ఒపీనియన్ మరియు ప్రెస్సు రెండూ దక్షిణాఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ పోరాటానికి ఎంతో సహకరించాయి. సత్యాగ్రహం భారతీయుల హృదయాలలో వ్రేళ్లు పాతుకున్న కొద్దీ ఇండియన్ ఒపీనియన్ మరియు ప్రెస్సులు రెండూ ఎంతో ప్రగతిని సాధించాయి



20

నిర్భంధాల వెల్లువ

రామసుందర్ పండిత్‌ను నిర్బంధించడంవల్ల ప్రభుత్వానికి ప్రయోజనం కలుగలేదని మనం చూచాం రెండో వైపున ప్రజల్లో ఉత్సాహం పెరిగిపోతున్న విషయం ప్రభుత్వం గ్రహించింది. ఇండియన్ ఓపీనియన్‌లో ప్రచురించబడే వ్యాసాల్ని, ఇండియన్ ఏసియాటిక్ శాఖ వాళ్లు కూడా శ్రద్ధగా చదువుతున్నారు జాతీయ పోరాటమేదీ రహస్యంగా జరగలేదు జాతిబలాన్ని జాతిబలహీనతల్ని రెండిటినీ జనం ఇండియన్ ఓపీనియన్ ద్వారా మిత్రులైనా, శతృవులైనా, తటస్థంగా వుండేవారైనా తెలుసుకుంటున్నారు తప్పుడుపని చేయనవసరంలేదు మోసానికి అతి తెలివికి చోటులేదు. తమ ఆత్మబలంతోనే విజయం సాధించుటకు అవకాశం వున్నా సత్యాగ్రహ సంగ్రామంలో రహస్యానికి తావులేదని కార్యకర్తలంతా తెలుసుకున్నారు. జాతి బలహీనతలనే రోగాల్ని తొలగించుకోవాలంటే వాటిని బయటపెట్టి, వాటిని బాగా అందరూ తెలుసుకో గలగాలని కార్యకర్తలు గ్రహించారు. ఏషియాటిక్ శాఖవారు. ఇండియన్ ఒపీనియన్ విధానం యిదేనని తెలుసుకున్నారు. భారత జాతీయ సత్యాగ్రహ సంగ్రామ చరిత్రగా ఇండియన్ ఒపీనియన్ పత్రిక రూపొందడం గమనించిన ఏషియాటిక్ శాఖాధికారులు యీ సంగ్రామానికి సంబంధించిన నాయకుల్ని