పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ప్రధమ అంతఃకలహం


17

ప్రధమ అంతఃకలహం

1907 జూలై1వ తేదీ వచ్చింది. అనుమతి పత్రాల్ని యిచ్చే ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. భారతజాతి పక్షాన అటువంటి ప్రతి ఆఫీసు ఎదుట పికెటింగు జరిషి, భారతీయుల్ని పత్రాలు తీసుకోకుండా ఆపాలని ఆదేశం యిచ్చాము తెల్ల ప్రభుత్వంవారి ఉచ్చులో చిక్కుకోవద్దని భారతీయుల్ని హెచ్చరించడం కూడా జరిగింది. ప్రతి వాలంటీరు ఒక బిళ్లను గుర్తుగా తగిలించుకోవాలి అనుమతి పత్రం తీసుకునే భారతీయుల్ని మాత్రం అవమానించవద్దని వాలంటీర్లకు నచ్చ చెప్పాము అట్టివారిని పేరు అడగండి అతడు తన పేరు చెప్పకపోతే అతడితో అసభ్యతగా వ్యవహరించకండి అట్టివారికి మనం తయారుచేసిన కరపత్రం యివ్వండి రక్తపు చట్టానికి లోబడితే, కలిగే ప్రమాదాల్ని గురించి వారికి చెప్పండి పోలీసులతో మంచిగా మెలగండి వారి జోలికి పోవద్దు పోలీసులు తిట్టినా, కొట్టినా సహించండి. ఒక వేళ దెబ్బలు సహించలేకపోతే అక్కడి నుంచి తప్పుకోండి అరెస్టు చేస్తే సంతోషంగా జైలుకు వెళ్లండి జోహన్స్ బర్గ్‌లో ఏమైనా జరిగితే తిన్నగా నాకు తెలియజేయండి. మిగతా చోట్ల అక్కడ నియమంపబడిన కార్యదర్శులకు తెలియజేయండి. వాళ్లు చెప్పిన ప్రకారం నడుచుకోండి కొద్ది మంది పికెటర్లకు ఒక నాయకుడు వుంటాడు. ఆనాయకుడి ఆదేశానుసారం అంతా నడుచుకోవాలి యిదంతా వాలంటీర్లకు నేర్పిన పాఠం

ఇలాంటి అనుభవం జాతికి మొదటిసారి కలిగింది. 12 సంవత్సరాలు దాటిన వారిని పికెటర్లుగా ఎన్నుకున్నారు. అందువల్ల 12 నుంచి 18 ఏండ్లవయస్సు గల యువకులు సైతం యీ దళాల్లో చేరారు. స్థానికకార్యకర్తలకు అపరిచితులైన వారిని ఎవ్వరినీ చేర్చుకోలేదు. అయినా ఎంతో జాగ్రత్తగా అంతావున్నారు. ఎవరైనా పత్రాలు తీసుకోవాలని అనుకుంటే, పికెటర్ల భయం వారికి కలిగితే అట్టివారికి హాని జరగకుండా చూస్తామని, ఒక వాలంటీరును