పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

151


కూడా వారికిచ్చి లోనికి పంపుతామని పత్రాలు తీసుకున్న తరువాత అట్టివారిని వాలంటీరు సురక్షితంగా బయటికి పంపుతాడని కూడా పలు పర్యాయాలు ప్రకటించాము కొందరు ఆ విధంగా ప్రయోజనం పొందారు కూడా!

వాలంటీర్లు ఎంతో ఉత్సాహంతో తమ పనులు నిర్వహించారు. ఎంతో జాగ్రత్తగా వున్నారు. వాలంటీర్లను పోలీసులు ఎక్కువగా బాధించ లేదని చెప్పవచ్చు. కొన్ని చోట్ల పోలీసులు బాధించితే వాలంటీర్లు సహించారు. ఈ కార్యక్రమాల్లో వాలంటీర్లు హాస్యరసాన్ని కూడా మేళవించారు. పోలీసులు కూడా అందుపాల్గొన్న ఘట్టాలు వున్నాయి. వాలంటీర్లు ఎన్నో ఛలోక్తులు విసురుతూ జనాన్ని నవ్వించుతూ వున్నారు. ఒకచోట రాకపోకలకు అడ్డు తగులుతున్నారని ఆరోపణ చేసి వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు ఆ విధంగా అరెస్టు అయిన వారి పక్షాన పకీళ్లను నియమించి ప్రజాధనాన్ని ఖర్చు చేయమని చెప్పడం కూడా జరిగింది. అన్నిటికీ సిద్ధపడే వాలంటీర్లు రంగంలోకి దిగారు. తరువాత కోర్టువారు అరెస్టు చేయబడిన వాలంటీర్లను నిర్దోషులుగా నిర్ణయించి వదిలి వేశారు. దాని వల్ల వాలంటీర్ల ఉత్సాహం బాగా పెరిగింది

ఈ విధంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పత్రాలు తీసుకునే వారికి హాని కలుగకుండా కాపాడినా వాలంటీర్ల దళాలకు తెలియకుండా ఒక రహస్య దళంగా ఏర్పడి కొందరు పత్రాలు తీసుకుంటే ఖబర్దార్ అంటూ జనాన్ని బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయం తెలియగానే వాళ్లెవరో తెలుసుకొని, అట్టి అరాజకాన్ని అరికట్టుటకు ప్రయత్నాలు చేశాము దానితో బెదిరింపులు ఆగిపోయాయి. కాని ఆ ప్రవృత్తి సమూలంగా మాత్రం వీడిపోలేదు. దాని వల్ల భారత జాతీయ సత్యాగ్రహ సంగ్రామానికి కొంత నష్టం కూడా కలిగింది. అలా భయపడ్డ వాళ్లు ప్రభుత్వ సంరక్షణ కోరగా, వారికి అది లభించింది. ఈ విధంగా ఒక విషంకొందరి హృదయంలో బయలు దేరింది. వాళ్లు బలహీనుల్ని బెదిరించారు. వాళ్లను యింకా పిరికి