పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

149


కాఛలియా సేర్ సదా ముందు వున్నాడు. ఏనాడూ ఆయన ముబంలో రంగు మారడం నేను చూడలేదు బిగ్గరగా చప్పట్లుకొట్టి సభ ఆయన ఉపన్యాసాన్ని సమర్థించింది. అప్పటికి కాఛలియాను గురించి నేను తెలుసుకున్న దానికంటే, జనం ఎక్కువ తెలుసుకున్నారని నాకు బోధపడింది. వారిలో చాలామందికి చింపిరి గుడ్డల్లో గల ఆముత్యాన్ని గురించి బాగా తెలుసు శ్రీ కాఛలియా చెప్పింది చేస్తాడని. చేసిందే చెబుతాడని వాళ్లకు తెలుసు సభలో యింకా ఆవేశంతో నిండిన ఉపన్యాసాలు కొందరు యిచ్చారు. నేను కాఛలియా ఉపన్యాసానికే అధికంగా ప్రాధాన్యం యిచ్చాను. ఆయన ఉపన్యాసం భవిష్యద్వాణిగా రూపొందడమే, అందుకు కారణం ఆవేశంతో ఉపన్యాసాలు యిచ్చిన వారలో చాలా మంది తమ మాట మీద నిలబడలేక పోయారు. ఆ పురుష సింహాన్ని మృత్యువు 1918లో అనగా సత్యాగ్రహ పోరాటం ముగిసిన నాలుగు సంవత్సరాల తరవాత భారతజాతికి సేవ చేస్తూ వున్నప్పుడు తన ఒడిలోకి తీసుకున్నది

కాఛలియా సేర్‌ను గురించిన ఒక సంస్మరణను మరో చోట వ్రాయడం సాధ్యం కాదు కనుక యిక్కడే వ్రాస్తున్నాను టాల్‌స్టాయి ఫాఠమును గురించి పాఠకులు యిక ముందు చదువుతారు. అక్కడ సత్యాగ్రహుల కుటుంబాలు వుంటున్నాయి. జాతి ప్రజలకు ఒక ఉదాహరణగా చూపాలని భావించి, తన కుమారుణ్ణి నిరాడంబరతను నేర్చుకోమని ప్రజా సేవ ఎలా చేయాలో తెలుసుకోమని చెప్పి ఫారంకు కాఛలియా పంపించాడు. అది చూచి మిగతా మహమ్మదీయులు కూడా తమ బిడ్డల్ని చదువు కోసం ఫారంలో చేర్చారు కాఛలియా కుమారుడి పేరు . అప్పుడు అతడిక్ 10 లేక 12 సంవత్సరాల వయస్సు వుంటుంది. స్వభావరీత్యా అలీ వినమ్రుడు కొద్దిగా చంచలుడు, సత్యవాది సరళహృదయుడు అయితే కాఛలియా సేర్ గతించిన తరువాత, సత్యాగ్రహ పోరాటం ముగిసిన తరువాత ఆ బిడ్డను కూడా దూతలు దేవుని దర్బారుకు తీసుకు పోయారు. ఆ పిల్లవాడు జీవించి యుంటే తన తండ్రికి నిజమైన ప్రతినిధి అయ్యేవాడని నా అభిప్రాయం