పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

వక్ర రాజనీతి లేక క్షణిక సంతోషం


15

వక్ర రాజనీతి లేక క్షణిక సంతోషం

ఓడ నుంచి కేప్‌టౌన్‌లో దిగిన తరువాత. జోహన్స్ బర్గ్ చేరిన పిమ్మట మదీరాలో అందిన తంతికి నిజానికి మేమూహించినంత విలువలేదని తేలింది. యిందులో తంతిపంపిన శ్రీ రిచ్ దోషం ఏమీ లేదు ఏషియాటిక్ అక్టును నిరాకరించే విషయమై తనకు తెలిసిన వివరం అతడు తంతిద్వారా మాకు తెలియజేశాడు. 1906లో ట్రాన్స్‌వాల్ ఒక చక్రవర్తి అధీనంలో వున్న అధినివేశరాజ్యం అని ముందే వ్రాశాను ఇటువంటి రాజ్యాల రాయబారులు ఆధినివేశరాజ్యాల మంత్రికి తమతమ రాజ్యాల హితానికి సంబంధించిన వివరాలు తెలియజేయుటకు ఎప్పుడూ ఇంగ్లాండులోనే వుంటా ఉండేవారు. ట్రాన్స్‌వాల్ రాయబారి సర్‌రిచర్డ్స్ సాల్‌మన్ దక్షిణాఫ్రికాకు చెందిన ప్రసిద్ధ వకీలు అతడు లార్డ్ ఎల్గిన్, ట్రాన్స్‌వాల్ రాయబారియగు సాల్‌మాన్‌తో చర్చించిన తరువాతనే రక్తపు చట్టాన్ని నిరాకరిస్తూ నిర్ణయించాడు. 1907 జనవరి 1వ తేదీ నుంచి ట్రాన్స్‌వాల్‌లో జవాబు ధారీ ప్రభుత్వం ఏర్పడ నున్నది. అందువల్ల లార్డ్ ఎల్గిన్ ట్రాన్స్‌వాల్ రాయబారితో “జవాబు దారీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత యీ చట్టాన్ని అక్కడి అసెంబ్లీలో ప్యాసు చేయండి. అప్పుడు పెద్ద ప్రభుత్వం దాన్ని నిరాకరించదు. ఇప్పుడున్న స్థాయిలో మీ రాజ్యం వున్నంతవరకు మీరు చేసే చట్టాలకు పెద్ద ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వుంటుంది పెద్ద ప్రభుత్వం రంగుభేదం లాంటి జాతీయ భేద భావాలకు సంబంధించిన రాజనీతిని అంగీకరించదు అందువల్ల ప్రస్తుతం నేను చక్రవర్తికి యీ రక్తపు చట్టాన్ని నిరాకరించాలని సలహా పంపుతాను" అని చెప్పాడు

ఈ విధంగా పేరుకు మాత్రం నిరాకరించినా, తెల్లవారి కోరిక నేరవేరితే చాలు రిచర్డ్స్ సాల్‌మన్‌కు అభ్యంతరం లేదు. ఎందుకుంటుంది. ఈ రాజనీతిని నేను “వక్రం" అని అన్నాను ఇంత కంటే కటువైన విశేషణం