పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

139


ప్రయోగించినా యిటు వంటి వక్రకుటిల రాజకీయజ్ఞులకు ఏ మాత్రం సరిపోదని నా విశ్వాసం చక్రవర్తి అధీనంలో వున్న అధినివేశరాజ్యాల పూర్తిబాధ్యత సామాజ్ర్య ప్రభుత్వానిదే దాని రాజ్యాంగంలో రంగు భేదానికి మరియు జాతి భేదానికి తావులేదు. ఈ రెండు అందమైన మాటలు జవాబుదారీ ప్రభుత్వం చేసే చట్టాలను సామ్రాజ్య ప్రభుత్వం రద్దు చేయజాలదు అనునది కూడా అర్థమయ్యే విషయమే కాని అట్టి రాజ్యాల రాయబారుల్ని పిలిచి రహస్య చర్చలు జరపడం రాజ్యాంగానికి విరుద్ధంగా పుండే చట్టాల్ని ఫలానా పద్దతిన నిరాకరిస్తామని చెప్పడం ఎవరి ఆధికారాలు హరిస్తున్నారో వారిని మోసం చేసి, వారికి తీరని అన్యాయం చేసినట్లు కాదా" నిజానికి లార్డ్ ఎల్గిన్ ఈ విధంగా వాగ్దానం చేసి ట్రాన్స్‌వాల్ యందలి శ్వేత జాతీయులను భారతీయులకు వ్యతిరేకంగా ఉద్యమం నడుపమని ప్రోత్సహించాడు. ఈవిధంగా తాను చేయతలిచాడు కనుక, ఆ విషయం తనను కలసిన భారతీయుల ప్రతినిధి బృంద సభ్యులకు చెప్పవచ్చుగదా! ఎవరు ఏమి చెప్పినా తన అధీనంలోగల రాజ్యాలకు సామ్రాజ్య ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బ్రిటిష్ రాజ్యాంగ మందలి మూల సిద్ధాంతాల్ని జావాబుదారీ ప్రభుత్వాలు గల అధినివేశ రాజ్యాలు కూడా అంగీకరించవలసిందే ఉదాహరణకు జవాబుదారీ ప్రభుత్వం గల ఏ అధినివేశరాజ్యం కూడా చట్టబద్ధంగా బానిస విధానాన్ని అమలు చేయుటకు వీలు లేదు. కనుక లార్డ్ ఎల్గిన్ రక్తపు చట్టం అనుచితమైనదని నిజంగా భావించి నిరాకరించియుంటే, రిచర్డ్స్ సాల్‌మన్‌ను ఒంటరిగా పిలిచి జావాబుదారీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా యిట్టి చట్టం చేయవద్దని చెప్పి యుండవలసింది. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం అట్టి చట్టం చేయదలుచుకుంటే, జవాబుదారీ ప్రభుత్వ స్థాపన అక్కడ జరపాలా లేదా అని సామ్రాజ్య ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి యుండవలసింది భారతీయుల అధికారాలను . సంపూర్తిగా రక్షిస్తామనే మాట తీసుకొని ట్రాన్స్‌వాల్‌లో జవాబుదారీ ప్రభుత్వ స్థాపన జరిపి యుండవలసింది. అలా చేయకుండా లార్డ్ ఎల్గిన్ బయటికి