పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

137

జీవితంలో ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకున్నాను తెలివితేటలు పెరిగినప్పటి నుంచి ట్రస్టీలమని, బాధ్యత కలిగిన వాళ్లమని మనం భావిస్తూ వుంటాము తల్లితండ్రి వున్నంతకాలం వారిచ్చిన డబ్బుకు. వారు అప్పగించిన పనులకు సంబంధించిన వివరాలు వారికి తెలుపుతూ వుంటాము అలా చేయడం మన కర్తవ్యం మన మీద కల నమ్మకం వల్ల వాళ్లు మనల్ని లెక్క ఆడగరు. అంత మాత్రాన మనం ఊరుకోకూడదు. మనం గృహస్థులమైనప్పుడు భార్య, బిడ్డలకు మనం బాధ్యులం అవుతాము మన సంపాదనకు మనం ఒక్కరమే కాక, మన కుటుంబ సభ్యులు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ల కోసం ప్రతిదమ్మిడీకి లెక్క మనం వ్రాయాలి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభిస్తే బాధ్యతలు బాగా పెరిగిపోతాయి సామాన్యంగా స్వయం సేవకులు కానీయండి, కార్యయకర్తలు కానీయండి, మనం పని చేస్తున్నాము, కదా! అందుకైనా లెక్క వ్రాసి అందరికీ చూపనక్కరలేదు అని భావిస్తూ వుంటారు. మనం తప్పుపని చేయం కనుక అంతా మనల్ని సమ్మితీరాలి అని కూడా భావిస్తూ వుంటారు. అలా భావించడం శుద్ధ తప్పు లెక్క వ్రాసి వుంచడానికి, నమ్మకానికి అపనమ్మకానికి సంబంధం లేదు. అసలు లెక్క వ్రాసి వుంచడం ప్రతి వాడికర్తవ్యం అలా చేయకపోవడం పెద్ద తప్పే ఏ సంస్థలోనైనా మనం పని చేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క పదాధికారులు ఏ కారణం వల్లనైనా మనల్ని లెక్క ఆడగకపోతే అదివారి దోషమే అవుతుంది. జీతం పుచ్చుకొని పనిచేస్తే వాళ్లు ఎలా లెక్కలు వ్రాసి వుంచాలో, అలాగే జీతం పుచ్చుకోని స్వయం సేవకులు కూడా లెక్కలు వ్రాయాలి అతడి పనియే అతనికి ముట్టే జీతమన్నమాట చాలామంది దీన్ని పట్టించుకోరు. అందువల్ల యీవిషయాన్ని యిక్కడ వ్రాశాను యింత చోటు యీ విషయానికి యిచ్చుటకు సాహసించాను