పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

127


అందువల్ల రెండింటికీ సంబంధం కుదరదు, కలవదు అంటే సత్యాగ్రహం, ఆయుధబలం రెండూ కలపడానికి వీలు లేదు. సత్యాగ్రహాన్ని మన ప్రీతిపాత్రుల విషయంలో కూడా ఉపయోగించవచ్చు. కాని పాసివ్‌రెసిస్టెన్సును ప్రీతిపాత్రులపట్ల ప్రయోగించడానికి వీలులేదు. పాసివ్‌రెసిస్టెస్సులో శతృ పక్షంవారికి దుఃఖం కలిగించుటకు, కష్టం కలిగించుటకు అవకాశం వుంటుంది కాని సత్యాగ్రహంలో శతృపక్షంవారికి దు:ఖం కష్టం కలిగించాలనే భావమే వుందదు. తాను కష్టపడి, తాను దు:ఖాలు సహించి శతృ పక్షంవారి హృదయాలను జయించాలనే సాత్విక గుణం సత్యాగ్రహంలో పనిచేస్తుంది ఈ రెండింటికీ గల ప్రధాన భేదం వివరించాను. అయితే పాసివ్‌రెసిస్టెన్సు గుణగణాలను గురించి నేను వర్ణించి చెప్పినట్లు ప్రతి పాసివ్ రెసిస్టెన్సులోను జరుగుతుందని చెప్పలేము అయితే పాసివ్ రెసిస్టెన్సుకు యిచ్చే పలు ఉదాహరణాల్లో దోషాలు ఎక్కువగా కనబడతాయి

చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు పాసివ్ రెసిస్టెన్సుకు ఆధినేతని అంటారు. కాని అది సరికాదు. వారిది సత్యాగ్రహం అని భావించాలి యిటువంటి ఉదాహరణలు చరిత్రలో పాసివ్‌రెసిస్టెన్సుకు లభించవు టాల్‌స్టాయి రష్యాకు చెందిన మఖోబోర్ ప్రజల ఉదాహరణ యిచ్చారు అది యిటువంటి పాసివ్‌రెసిస్టెన్స్ అనగా సత్యాగ్రహానికి ఉదాహరణయే ఏసుక్రీస్తు తరువాత వేలాది మంది క్రైస్తవులు ఎన్నో అత్యాచారాల్ని సహించారు. పాసిప్ రెసిస్టెన్స్ అనుశబ్దం వారికి ఎవ్వరూ వాడలేదు. అట్టి ఉత్తమ ఉదాహరణలన్నింటికి నేను సత్యాగ్రహమనే పేరు పెడతాను ఇదే పాసివ్ రెసిస్టెన్స్ అని అంటే, సత్యాగ్రహానికి, దానికి తేడాయే యుండదు

పాసివ్ రెసిస్టెన్స్ యొక్క లక్షణాలను గురించి పైన తెలిపిన హెచ్చరిక ఆశక్తిని ఉపయోగించేవారికి అన్యాయం జరుగకూడదనే భావంతోనే చేయవలసి వచ్చిందనిమనవి చేస్తున్నాను. అయితే నేను సత్యాగ్రహియొక్క లక్షణాలని పేర్కొన్నవన్నీ ప్రతి సత్యాగ్రహియందూ వున్నాయని చెప్పలేను. అయితే నేను తెలిపిన గుణాలు చాలామంది సత్యాగ్రహులకు, తెలియవని కూడా చెప్పుటకు సందేహించను