పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం

సత్యాగ్రహం బలహీనుల ఆయుధమని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. అసలు సత్యాగ్రహం ఆయుధాల బలప్రయోగానికి ముందుయిచ్చే శిక్షణ అనికూడా కొందరు అంటున్నారని విన్నాను. యిది సరికాదు. మరోసారి స్పష్టంగా చెబుతున్నాను ఎటువంటి గుణాలు గల సత్యాగ్రహులు కనబడ్డారో నేను వివరించలేదు. అసలు సత్యాగ్రహం అను భావంయొక్క గూఢార్థం ఏమిటో వివరించాను ఆవిధంగా సత్యాగ్రహి అంటే ఎలా వుండాలో స్పష్టంగా వివరించాను. ఈ ప్రకరణం వ్రాయడానికి గల ఉద్దేశ్యం క్లుప్తంగా మరో మారు వివరిస్తాను ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు ఏశక్తిని ప్రదర్శించడానికి పూనుకున్నారో, ఆశక్తిని గురించి ప్రజలకు స్పష్టంగా బోధపరుచుటకు ప్రయత్నించాను. ఆశక్తిని పాసివ్‌రెసిస్టెన్స్ అని పిలిచే శక్తితో అపోహపడి కలిపి చేయకూడదనీ, అందువల్లనే జాగ్రత్తగా యీ శక్తిని ప్రకటించగల శబ్దం కోసం వెతకవలసి వచ్చిందనీ చెప్పాను దానితోబాటు సత్యాగ్రహంలో అప్పుడు ఏఏ సిద్ధాంతాల్ని చేర్చామో కూడా వివరించాను




14

ఇంగ్లాండులో ప్రతినిధిబృందం

ట్రాన్స్‌వాల్‌లో ఖూనీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరెవరకి అర్జీలు దాఖలు చేయాలో వారందరికీ దాఖలు చేశాము ట్రాన్స్‌వాల్ అసెంబ్లీ మాత్రం స్త్రీలకు సంబంధించిన నిబంధనను తొలగించింది. కాని మిగతా బిల్లు గెజెట్‌లో ప్రకటించబడినట్లుగా అంగీకరించబడింది. అయినా అప్పుడు భారతజాతిలో గట్టిదనం, ఉత్సాహం, ఆవేశం, శక్తి సామర్థ్యాలు వుండటం వల్ల దాన్ని ఎవ్వరూ లేక్కచేయలేదు. దానితో ప్రభుత్వం అందుకు సంబంధించిన చర్యలన్నీ చట్టరీత్యా గైకొనాలని నిర్ణయించింది. అప్పటివరకు ట్రాన్స్‌వాల్ రాజ్యం "క్రౌన్‌కాలనీ"గా వున్నది. క్రౌన్‌కాలనీ అంటే సామ్రాజ్యంలో వున్న అధినివేశ రాజ్యం అన్నమాట అంటే బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం