పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

సత్యాగ్రహం-పాసివ్‌రెసిస్టెన్స్

ఈ భావాలు సరియైనవా కాదా అని మనం యిక్కడ యోచించినవసరం లేదు. మనం పాసివ్ రెసిస్టెన్స్ మరియు సత్యాగ్రహానికి మధ్యనగలతేడాను తెలుసుకోవాలి. ఈ రెండు శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి ఆ తేడా తెలుసుకోకపోతే పాసివ్‌రెసిస్టెన్స్‌ను ఉపయోగించేవాళ్లు మరియు సత్యగ్రహాన్ని అంగీకరించేవాళ్లు యిద్దరూ ఒకటే అనుకుంటే అన్యాయం జరుగుతుంది హానికరమైన పరిణామాలు ఏర్పడతాయి మేము స్వయంగా దక్షిణాఫ్రికాలో పాసివ్‌రెసిస్టెన్స్ శబ్దాన్ని వాడాము ఓటింగ్ హక్కు కోసం పోరాటం జరిపినా బ్రిటిష్ స్త్రీల పరాక్రచూన్ని మరియు ఆత్మత్యాగాన్ని మాపై ఆరోపించి మమ్మల్ని --శంసించకూడదు. చాలామంది అబ్రిటిష్ స్త్రీల మాదిరిగా మేము కూడా ప్రజల అస్థిపాస్తులకు నష్టంకలిగించే వాళ్లమేనని భావించారు. శ్రీ హాస్కిన్ వంటివారు సైతం మమ్మల్ని బలహీసులుగా భావించారు. మనిషి యోచనలకు అమిత శక్తి వుంటుంది తను అనుకున్న ఆలోచనకు అనుగుణ్యంగా మనిషి అయిపోతాడు. మమ్మల్ని గురించి ఆలా అనుకునే వారిని అనుకోనిస్తే చివరక ఆ ఆయుధాన్ని సైతం వదలివేయడానికి మణము సిద్ధపడిపోవచ్చు. అలాంటి పాసివ్‌రెసిస్టెన్స్‌ను ఉపయోగిస్తూమేము జన్మలో బలవంతులం కాలేము మేము సత్యాగ్రహులమైయుండి, మమ్ము మేము బలవంతులమని భావించి సత్యాగ్రహశక్తిని ఉపయోగించిన రెండు పరిణామాలు కలుగుతాయి. బలమనే భావాన్ని పోషిస్తూ రోజు రోజుకు మేము బలవంతులమవుతాము మా బలం పెరిగిన కొద్దీ మా సత్యాగ్రహ తేజస్సు పెరుగుతుంది. పాసివ్‌రెసిస్టెన్స్‌లో ప్రేమకు తావు వుండదు. కాని సత్యాగ్రహంలో వైరభావానికి తావు వుండడు అసలు సత్యాగ్రహికి వైరి అంటూ ఎవ్వడూ వుండడు. పాసివ్‌రెసిస్టెన్స్‌లో అవకాశం చిక్కితే ఆయుధ బలానికి తావు వుంటుంది కాని సత్యాగ్రహ సమరంలో అత్యుత్తమైన అనుకూల పరిస్థితులు ఏర్చడినా ఆయుధ ప్రయోగానికి తావు. వుండదు పాసివ్‌రెసిస్టెన్సు నందు ఆయుధశక్తికి అవకాశం వుంటుంది కాని సత్యాగ్రహంలో అట్టి యోచనకు సైతం తావు వుండదు ఆయుధశక్తితో పాటు పాసివ్‌రెసిస్టెన్సు నడుస్తుంది. కాని సత్యాగ్రహంలో అలా నడవడానికి అవకాశమే వుండదు