పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

123


జరిగింది. ఈ చరిత్రను పొడిగించుటకు ముందు పాసివ్‌రెసిస్టెన్స్ మరియు సత్యాగ్రహం అను రెండు శబ్దాలకు మధ్యగల భేదాన్ని తెలుసుకోవడం అవసరం తరువాత ప్రకరణంలో యీ భేదాన్ని తెలుసుకుందాం




13

సత్యాగ్రహం-పాసివ్‌రెసిస్టెన్స్

బారతీయుల జాతీయ ఉద్యమం తీవ్రరూపం దాల్చే కొద్దీ ఆంగ్లేయులకూడా ఆకర్షితులయ్యారు. ట్రాన్స్‌వాల్ యందలి ఇంగ్లీషు పత్రికల వాళ్లంతా ఖూనీ చట్టాన్ని సమర్థిస్తూ, ఇంగ్లీషువాళ్ళంతా దాన్ని సమర్దిస్తూ వుండేవారు. అయినా భారతీయులు ఏమైనా వ్రాసిపంపితే తమ పత్రికల్లో తప్పక ప్రకటిస్తూవుండేవారు ప్రభుత్వానికి భారతీయులు పంపే ఆర్జీలను పూర్తిగా ప్రచురిస్తూ వుండేవారు పూర్తిగా ప్రకటించని వాళ్లు సారాంశమైనా తప్పకప్రకటిస్తూ వుండేవారు భారతీయులు జరిపే మీటింగులకు తమ విలేకర్లను పంపుతూ వుండేవారు విలేకర్లను సంపనివాళ్లు మనం సభావిశేషాలు వ్రాసి పంపితే ప్రకటించేవాళ్లు

ఇంగ్లీషు పత్రికల సౌహర్ధ్రతతో కూడిన యీవ్యవస్థ భారతజాతీయ ఉద్యమానికి ఎంతో సహయం చేసింది. ఉద్యమం ప్రారంభించిన తరువాత ఆంగ్లేయులు కూడా అందుపాల్గొనసాగారు అట్టి అగ్రగణ్యుల్లో జోహన్స్‌బర్గుకు చెందిన ఆంగ్లలక్షాధికారి శ్రీ హాస్కిన్ ఒకరు వారిహృదయంలో రాగద్వేషాలు లేవు ఉద్యమం ఆరంభించిన తరువాత వారు నా దగ్గరకు రాసాగారు జోహన్స్‌బర్గ్‌లో జమిస్టన్ ఒక ఉపనగరం అక్కడి ఆంగ్లేయులు నా ఉపన్యాసం వింటామని వార్త పంపారు. ఒక సభ జరిగింది. శ్రీ హాస్కిస్ ఆ సభకు అధ్యక్షత వహించారు. నేను ఉపన్యాసం యిచ్చాను సభలో శ్రీ హాస్కిన్ భారతీయుల ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూ నన్ను పరిచయం చేస్తూ ట్రాన్స్‌వాల్ భారతీయులు న్యాయంకోసం ప్రయత్నించి విఫలురైపాసివ్ రెసిస్టెన్స్‌ను ఆశ్రయించారు. వాళ్లకి ఓటింగు అధికారంలేద వారి సంఖ్య స్వల్పం (వాళ్లు బలహీనులు) వాళ్ల దగ్గర ఆయధాలులేవు. అందువల్ల