పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

సత్యాగ్రహ పుట్టుక


జరిగినా భారతీయులు మాత్రం యిది ఉద్యమ ఫలితమేనని భావించారు వారి ఉత్సాహం ఇనుమడించింది

ఈ జాతీయ ఉద్యమానికి ఏం పేరు పెట్టాలి, అని ఎవ్వరం అప్పుడు ఆలోచించలేదు. అప్పుడు నేను "పాసిప్ రెసిస్టెన్స్' అని పేరుపెట్టాను పాసివ్‌రెసిస్టెన్స్‌కు గల గూఢార్థం ఏమిటో నేను యోచించలేదు. అయితే నూతన సిద్ధాంతానికి యిది ప్రతీక అని అనుకున్నాను. ఉద్యమం విజృంభించినప్పుడు పాసిప్ రెసిస్టెన్స్ శబ్దంవల్ల చిక్కులు పెరిగిపోయాయి ఇంతపెద్ద ఉద్యమానికి ఇంగ్లీషు పేరు పెట్టినందుకు సిగ్గుపడ్డాను. యీ ఇంగ్లీషు శబ్దాలు భారతజాతి పెదవులపై ఆడలేవు. అందువల్ల మంచి భారతీయ భాషా శబ్దం సూచించమని ఇండియన్ ఒపీనియన్‌లో ప్రకటించి అందుకు బహుమాసం కూడా ప్రకటించాను కొన్నిపేర్లు నాదగ్గరకి వచ్చాయి ఉద్యమ స్వరూప వివరమంతా స్పష్టంగా ప్రకటించాను శ్రీమగన్‌లాల్ గాంధీ “సదాగ్రహం" అని పేరు సూచించారు. వివరం వ్రాస్తూ భారతీయుల ఆగ్రహం అనగా పట్టుదల, నద్ అనగా శుభంకరమైనది. కనుకదీన్ని సదాగ్రహం అని వివరించారు. యీ పేరునాకు నచ్చింది. కాని నేను చేర్చాలనుకున్న విషయం యిందులో రాలేదని అనిపించింది. అందువల్ల నేను 'ద'ను 'త' చేసి అందు'య' చేర్చాను అంటే ఆవిధంగా సత్యాగ్రహం అయిందన్నమాట సత్యంలో శాంతి యిమిడి వుంటుంది. ఏ విషయం పైనా ఆగ్రహం అనగా పట్టుదలపట్టితే శక్తి ఆవిర్భవిస్తుంది. అందువల్ల ఆగ్రహం అనుశబ్దానికి బలాన్ని యిచ్చి భారతీయుల యీ మహోద్యమానికి నేను సత్యాగ్రహం అని పేరు పెట్టాను అంటే సత్యము, శాంతికి రెండిటితో ఆవిర్భవించే బలం అన్నమాట. యీ విధంగా సత్యాగ్రహశబ్దాన్ని గురించి వ్యాఖ్యానించాను పాసివ్ రెసిస్టెన్స్ అను ఇంగ్లీషు శబ్దాన్ని తొలగించిచేశాను ఇంగ్లీషులో వ్రాసిన వ్యాసాల్లో సైతం పాసివ్ రెసిస్టెన్స్ అనుశబ్దాన్ని వాడుటం తగ్గించివేశాను సత్యాగ్రహశబ్దాన్ని వివరించే ఇంగ్లీషు శబ్దాన్ని ప్రయోగించడం ప్రారంభించాను. ఈ విధంగా సత్యాగ్రహం అను పేరు యొక్క పుట్టుక