పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

సత్యాగ్రహం-పాసివ్‌రెసిస్టెన్స్


బలహీనుల ఆయుధమైన పాసివ్‌రెసిస్టెన్సును చేతబట్టారు' అని అన్నారు వారిమాటలు విని నేను నివ్వెరబోయాను దానితో నా ఉపన్యాస విఛానమే మారిపోయింది. నేను శ్రీ హాస్కిన్ చెప్పిన వాదనను ఖండించాను. పాసివ్‌రెసిస్టెన్స్ అంటే సోల్‌ఫోర్స్ అనగా ఆత్మబలం అని చెప్పాను పాసిప్‌రెసిస్టెన్స్ అను శబ్దంవల్ల భయంకరమైన అపోహలు తలఎత్తే ప్రమాదం వున్నదని గ్రహించాను. నావాదనలను విస్తారింగా వివరించి పాసెవ్ రెసిస్టెన్స్‌కు మరియు ఆత్మబలానికి మధ్యగల తేడాను సవివరంగా తెలియజేస్తానని చెప్పి అందుకు ప్రయత్నించాను పాసివ్‌రెసిస్టెన్స్ అను యీ రెండు శబ్దాల్ని ఇంగ్లీషులో ఎవరు ప్రారంభించారో నాకు తెలియరు (అధికసంఖ్యాకులు చట్టం చేస్తే అది అల్ప సంఖ్యాకులకు యిష్టంకాకపోతే, వాళ్లు ఆ చట్టానికి వ్యతిరేకంగా విప్లవం రెచ్చకొట్టకుండా దానిముందు తలవంచకుండా పాసివ్ అనగా మెతక వైఖరి అవలంబిస్తారు. అందుకు విధించబడే శిక్షను అనుభవించుటకు సిద్ధపడతారు. కొద్ది ఏండ్లక్రితం బ్రిటిష్ పార్లమెంటులో విద్యకు సంబంధించిన చట్టం ప్యాసుచేశారు. అప్పుడు ఇంగ్లాండునందలి నాన్‌కానఫేమిష్ట అను పేరు గల క్రైస్తవ సంప్రదాయానికి చెందినవారు డా|| క్లిఫర్డ్ నాయకత్వాన పాసిప్ రెసిస్టెన్స్‌ను ఆశ్రయించారు. ఆంగ్లమహిళలు ఓటింగు హక్కుకోసం చేసిన ఉద్యమం కూడా పాసివ్‌రెసిస్టెన్స్ ఆ రెండు ఉద్యమాల్ని దృష్టియందుంచుకొనే శ్రీ హాస్కీన్ ఇంగ్లీషువాళ్ల సభలో "పాసివ్ రెసిస్టెన్స్" ఓటింగు హక్కు లేని బలహీనుల ఆయుధం అని అన్నారు ఊ|| క్లిఫర్డ్ పక్షం ఓటింగు హక్కుగల వారిది కాని బ్రిటిష్ పార్లమెంటులో వారి సంఖ్య తక్కువగా వున్నది అందువల్ల వారి శక్తి బిల్లును ప్యాసు చేయకుండా ఆపలేకపాయింది అంటే సంఖ్యా బలంలో బలహీనమని తేలింది. అయితే నాన్‌కన్ఫామిస్ట్ పక్షం తమ లక్ష్యసాధనకు ఆయుధాల ప్రయోగాన్ని వ్యతిరేకించలేదు. కాని యిటువంటి వ్యవహారంలో ఆయుధాల్ని ఉపయోగించితే జయం లభిస్తుందనే ఆశ దానికి లేదు. యింతేగాక హఠాత్తుగా ఆయుధ ప్రయోగంచేసి అధికారం పొందే పద్దతి పరిపాలనా వ్యవస్థయందు సరియైనది కాదు. క్లిఫర్డ్‌పక్షంవారిలో కొందరు ఆయుధాలు ఉపయోగించుటకు