పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

111


అని మమ్మల్ని కోరాడు మేము సంతోషంగా అంగీకరించాము జూలూలకు తగిలిన గాయాలకు చికిత్స లేక క్రుళ్లి దుర్వాసన వస్తున్నది. వాళ్లందరిగాయాలు కడిగి చికిత్స చేసే సదవకాశం మాకు లభించింది. పాపం ఆ హబ్షీలు మాతో ఏమీ మాట్లాడలేరు. కాని వారి సైగలు, వేళ్లద్వారా వారు వెల్లడించే కృతజ్ఞతా భావం మాకు బోధపడుతూ వుండేది. వాళ్లు మమ్మల్ని తమకోసం దేవుడు పంపిన దూతలుగా భావించారు. ఇది కష్టమైనపని ఇందుకోసం రోజుకు 40 మైళ్ల దూరం మేము నడవవలసి వచ్చేది.

ఒక నెల రోజుల్లో మా పని పూర్తి అయింది. అధికారులు మా పనిని చూచి సంతోషించారు. గవర్నరు మాకు కృతజ్ఞత తెలుపుతూ జాబు పంపారు ప్రత్యేకంగా తయారుచేసిన పతకం కూడా మా దళసభ్యులందరికీ యిచ్చి గౌరవించారు. ఈ దళపు ముగ్గురు సార్జెంట్లు గుజరాతీలు వాళ్లపేర్లు శ్రీ ఉమియాశంకర్ షేలత్, శ్రీ సురేంద్రరాయ్ మేఢ్. శ్రీహరిశంకర్ జోషి ఈ ముగ్గురూ బలిష్ఠులు గట్టివాళ్లు బాగా పనిచేశారు. ఇతర భారతీయుల పేర్లన్నీ యిప్పుడు జ్ఞాపకం లేవు. కాని వారిలో ఒక పరాను కూడా వున్నాడు మేమంతా తనతో సమంగా బరువులు మోయడం, నడవడం చూచి పరాను నివ్వెరబోయేవాడు

ఈ సేవా కార్యం చేస్తున్నప్పుడు నాలో రెండు భావాలు పరిపక్వమయ్యాయి సేవాధర్మం ఆచరించవలెనని కోరువారు జీవితంలో బ్రహ్మచర్యాన్ని పాటించితీరాలి ఇది మొదటి భావం సేవాధర్మం ఆచరింరవలెనని భావించువారు బీదతనాన్ని అంగీకరించి పాటించితీరాలి. ఇది రెండో భావం వృత్తులేమైనా చేపట్టి చేస్తూవుంటే సేవాధర్మానికి పూనుకున్నప్పుడు యిబ్బందులు కలుగుతాయి

ఈ దళంతో పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్‌వాల్ రమ్మని జాబులు, తంతులు చాలా వచ్చాయి. మా సేవాకార్యం పూర్తికాగానే వెంటనే ఫినిక్స్ వచ్చి మిత్రులందరినీ కలిసి జోహాన్స్‌బర్గు చేరుకున్నాను. అక్కడ ఆఫీసులో ఏషియాటిక్ ఆక్టు ముసాయిదా పూర్తిగా చదివాను. 1906లో ప్రచురించిన గెజెటును ఆఫీసునుంచి యింటికి తీసుకువెళ్లాను నా ఇంటి దగ్గర ఒక చిన్న