పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

సజ్జనత్వానికి ప్రతీకారం


పర్వతం వున్నది. అక్కడ ఒక మిత్రునితోబాటు కూర్చొని ఆ ఆక్టును గుజరాతీలోకి అనువదిస్తున్నాను ఆ బిల్లు నిబంధనలను అనువదించిన కొద్దీ నా శరీరం వణికిపోసాగింది భారతీయులంటే ఆసహ్యం, ఏహ్యత తప్ప నాకు అందు మరేమీ కనబడలేదు. ఈ బిల్లు అసెంబ్లీలో ప్యాసై అమల్లోకి వస్తే దక్షివాఫ్రికాలో గల భారతీయులకు ఆధోగతి తప్పదని నిర్ణయానికి వచ్చి దీన్ని ఎదుర్కొని తీరాలని భావించాను. భారతజాతికి జీవన్మరణసమస్య అని తేల్చుకున్నాను ఆర్జీలు పెట్టినా పనికాకపోతె చేతులు ముడుచుకొని కూర్చోకూడదనే నిర్ణయానికి వచ్చాను ఈ ఖూనీ చట్టానికి లోబడేకంటే ప్రాణాలు వదిలి చావడం మంచిదని భావించాను. ఐతే ఎలా చావాలి? జయమో మృత్యువో రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయం కావాలి నా కండ్ల ఎదుట పెద్దకోటగోడలా నిలబడిపోయింది నన్ను యింతగా కదిలించివేసిన ఆ బిల్లును గురించిన వివరం పాఠకుల కోసం క్రింద వివరిస్తున్నాను

ట్రాన్స్‌వాల్‌లో నివసించుటకు అధికారం కావాలని కోరుకునే ప్రతి భారతీయుడు, స్త్రీగాని, పురుషుడుగాని, 8 సంవత్సరాలు, అంతకంటే పై యీడు గల బాలబాలికలు గాని అంతా ఏషియాటిక్‌శాఖ ఆఫీసుకు వెళ్లి పేరు వ్రాయించుకొని అనుమతి పత్రం పొందాలి యీ పత్రాలు తీసుకునేటప్పుడు తమ వద్ద గలపాత పత్రాలన్నీ అక్కడ యిచ్చివేయాలి అందుకు అర్జీ పెట్టుకోవాలి పేరు, అడ్రసు. జాతి, వయస్సు మొదలుగా గల వివరాలు అర్జీలో వ్రాయాలి ఆర్టీదారు తన పది వ్రేళ్ల ముద్రలు అందువేసి తీరాలి నిర్ణయించ బడిన గడువులోపున యిట్టి అర్జీదాఖలు చేయని భారతీయులు ట్రాన్స్‌వాలులో నివసించు హక్కు కోల్పోతారు తక్షణం వాళ్లు ట్రాన్స్‌వాల్ వదిలి వెళ్లిపోవాలి అర్జీదాఖలు చేయకపోతే చట్టరీత్యా అపరాధంగా భావించబడుతుంది. అట్టి దోషికి శిక్ష పడవచ్చు జుర్మానా విధించవచ్చు కోర్టు అతణ్ణి దేశాన్నుంచి బహిష్కరించవచ్చు. పిల్లల పక్షాన తల్లి తండ్రులే ఆర్జీ దాఖలు చేయాలి పిల్లల్ని తీసుకొని వెళ్లి ఆఫీసర్ల ఎదుట హాజరు పరచాలి తల్లితండ్రులు తమ యీ బాధ్యతను నిర్వహించకపోతే వారి 16 సంవత్సరాలు దాటిన పిల్లలు యీ బాధ్యత నిర్వహించాలి. అలా