పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

113


చేయకపోతే తల్లితండ్రులు ఏఏ శిక్షలకు పాత్రులు అవుతారో, ఆయా శిక్షలకు 16 సంవత్సరాల పిల్లలు కూడా పాత్రులవుతారు. పొందిన అనుమతి పత్రాన్ని ఏ పోలీసు అయినా ఎక్కడ, ఎప్పుడు చూపమన్నా చూపి తీరాలి చూపకపోతే అతడు అన్ని శిక్షలకు పాత్రుడే రోడ్డున నడిచే బాటసారిని కూడా పత్రం చూపించమని కోరవచ్చును పత్రాల్ని పరిరక్షించేందుకు పోలీసు అధికారులు భారతీయుల గృహాల్లోకి కూడా ప్రవేశించవచ్చు బయటినుంచి ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశించునప్పుడు యిట్టి ప్రవేశ పత్రాల్ని వాళ్లే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లి చూపించాలి భారతీయులు ఏ పని మీద ఎక్కడికి వెళ్లినా అధికారులు అడగగానే పత్రం చూపించాల్సిందే అలా చూపించకపోయినా అధికారులు అడిగిన వివరం తెలుపకపోయినా శిక్షార్హులే అవుతారు

ఇలాంటి నిబంధనలుగల చట్టం ప్రపంచంలో ఏ దేశంలోను ఎవ్వరూ తయారు చేసి యుండరు. భారతీయ గిర్‌మిటియాలకు యిచ్చే పత్రాల నిబంధనలు కఠోరంగా వున్నాయని నాకు తెలుసు కాని వాళ్లకు స్వతంత్ర మనుష్యులుగా గుర్తింపలేదు కదా! అయినా వాళ్లకు విధించబడిన శిక్షలు యీ బిల్లులో విధంచబడిన శిక్షలకంటే తక్కువే ఈ బిల్లు ప్రకారం లక్షలాది రూపాయలు వ్యాపారం చేసుకుంటున్న భారతీయుడుకూడా దేశాన్నుంచి బహిష్కరించబడవచ్చు. ఈ బిల్లునందు పేర్కొనబడిన నిబంధనల ప్రకారం అట్టవారి డబ్బంతా ప్రభుత్వం యీ పేరిట దోచుకోవచ్చునన్నమాట. ఆ తరువాత యిలా జరిగిందికూడా అపరాధ ప్రవృత్తిగల వారికోసం విధించబడిన నిబంధనల కంటే గూడా యివి కఠోరంగా వున్నాయని చెప్పవచ్చు పదివ్రేళ్లముద్రలు వేయాలనే నిబంధన దక్షిణాఫ్రికాదేశంలో ఎక్కడా లేదు ఆ విషయం తెలుసుకుందామని ఒకపోలీసు అధికారియగు శ్రీ హెన్రీ వ్రాసిన ఫిగర్ ఇంప్రెషన్స్ (వ్రేళ్ల ముద్రలు) అను పుస్తకం తెప్పించి చదివాను అపరాధం చేసిన చట్టవ్యతిరేకుల చేతనె యిలా వేలిముద్రలు వేయిస్తారని తెలిసింది. యిది భయంకర నిబంధన అని అనిపించింది. పిల్లకు, స్త్రీలకు కూడా వర్తించే యీరకమైన బిల్లు మొట్టమొదటిసారి బయటికి వస్తున్నదని తేలిపోయింది.