పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

సజ్జనత్వానికి ప్రతీకారం


అప్పుడూ సందేహం కలిగింది. ఇప్పటికి ఆ సందేహం అలాగే వున్నది అయినా నేటాలులో దీన్ని తిరుగుబాటు అని అంతా అన్నారు. అ తిరుగుబాటును శాంతింపచేయాలనే బావంతో చాలామంది తెల్లవాళ్లు వాలంటీర్లుగా సైన్యంలో చేరారు

నేను కూడా నేటాల్ వాసినే కనుక సైన్యంలో చేరి యీ యుద్ధంలో శక్త్యానుసారం సాయం చేయాలని భావించాను. భారతజాతి అనుమతి పొంది యీ విషయం నేటాలు ప్రభుత్వాన్ని జాబుద్వారా యుద్ధంలో గాయపడ్డవారికి సేవచేసే దళాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరాను నా ప్రతిపాదనను ప్రభుత్వం అనుమతించింది. అందువల్ల జోహాన్స్‌బర్గు నందుగల నా యింటిని వదిలివేసి, నా కుటుంబసభ్యుల్ని ఫనిక్స్ ఆశ్రమం పంపివేశాను అక్కడి నుండి ఇండియన్ ఒపీనియన్ అనువారపత్రిక వెలువడుతున్నది. నా మిత్రులు అక్కడ వున్నారు. ఆఫీసును మాత్రు నేను మూసివేయలేదు. నేను పూనుకున్న సేవా కార్యం ఎంతో కాలం సాగదని నాకు తెలుసు

20, 25 మందితో దళం ఏర్పరిచి నేను నేటాలు సైన్యంతో సంబంధం పెట్టుకున్నాను. ఇంతటి చిన్నదళంలో కూడా అన్ని జాతుల. అన్ని మతాలు భారతీయులు చేరారు. ఒక నెల రోజులు యీ దళం గాయపడ్డవారికి సేవ చేసింది. మాకు అప్పగించబడిన పనికి నేను భగవంతునికి ధన్యవాదాలు సమర్పించాను యుద్ధంలో గాయపడిన హబ్షీలకు మేము దప్ప మరెవ్వరూ సేవ చేయలేదు. మేము లేకపోతే హబ్షీలు చాలామంది చచ్చిపొయివుండేవాళ్లు. వాళ్ల గాయాలకు మందులు రాసేటప్పుడు, పట్టీలు కట్టేటప్పుడు, చికిత్స చేసేటప్పుడు ఒక్క ఇంగ్లీషు వాడు కూడా మాకు సహకరించలేదు. ఒక సర్జనుక్రింద మేము పనిచేయాలి అతడి పేరు డా|| సావెజ్ అతడు దయాహృదయుడు గాయపడ్డవాళ్లను ఆసుపత్రికి చేర్చడం వరకే మా పని ఆ తరువాత మేము వారికి ఏమీ సేవ చేయుటకు వీలులేదు. మాకు అప్పగించిన ప్రతిపని చేయాలనే వుద్దేశ్యంతోనే మేము యీ దళం ఏర్పాటు చేశాం ఆ సర్జను వ్యవహారమంతా చూచి ఏమండీ! వీళ్లకు చికిత్స చేయాలంటే ఒక్క తెల్లవాడూ సహకరించడంలేదు. మీరు ఆ పని కూడా చేస్తే కృతజ్ఞుడుగా వుంటాను